#INDvsNZTest : భార‌త్ బ్యాటింగ్ కీవీస్ బౌలింగ్

క్రీజులో పుజారా, శుభ్ మ‌న్ గిల్

IND vs NZ Test : భార‌త్, న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఫ‌స్ట్ మ్యాచ్ కాన్పూర్ లో ప్రారంభ‌మైంది. టీమిండియా స్కిప్ప‌ర్ అజింక్యా ర‌హానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆది లోనే జెమీస‌న్ బౌలింగ్ లో బ్లండెల్ కు క్యాచ ఇచ్చి మ‌యాంక్ అగ‌ర్వాల్ అవుట్ అయ్యాడు.

అత‌డి స్థానంలో ఛ‌తేశ్వ‌ర్ పుజారా బ‌రిలోకి దిగాడు. మ‌రో వైపు ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ ధాటిగా ఆడుతున్నాడు.

క‌డ‌ప‌టి వార్త‌లు అందే స‌రికి భార‌త జ‌ట్టు వికెట్ కోల్పోయి 68 ప‌రుగులు చేసింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో ఓడించిన కీవీస్ కు ఈసారి షాక్ ఇవ్వాల‌ని అనుకుంటోంది భార‌త్.

స్టార్ ప్లేయ‌ర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లేకుండానే బ‌రిలోకి దిగింది టీమిండియా.

యంగ్ ప్లేయ‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఈ మ్యాచ్ తో టెస్టుల్లోక అరంగేట్రం చేశాడు.

1988లో గెలిచిన కీవీస్ ఆనాటి నుంచి నేటి దాకా భార‌త్ లో గెలిచిన దాఖ‌లాలు లేవు. 2016లో జ‌రిగిన టెస్టు సీరీస్ ను సైతం టీమిండియా క్లీన్ స్వీప్ చేసి సీరీస్ గెలుపొందింది.

ఇక భార‌త జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవ‌డంతో ర‌హానేకు భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ప‌గ్గాలు అప్ప‌గించింది. వైస్ కెప్టెన్ గా ఛ‌తేశ్వ‌ర్ పుజారాను ఎంపిక చేసింది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే శుభ్ మ‌న్ గిల్, మ‌యాంక్ , ఛ‌తేశ్వ‌ర్ పుజారా, ర‌హానే, శ్రేయ‌స్ అయ్య‌ర్, వృద్ధి మాన్ సాహా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్ ను ఎంపిక చేసింది మేనేజ్ మెంట్.

కీవీస్ త‌ర‌పున టామ్ , విల్ యంగ్ , విలియ‌మ్స‌న్ , రాస్ టేల‌ర్ , హెన్రీ నికోల్స్ , టామ్ , ర‌చిన్ ర‌వీంద్ర‌, సౌథీ, ప‌టేల్ , జామీ స‌న్ , సోమ‌ర్ విల్లే ఉన్నారు.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబ‌ర్, హ‌స‌రంగ టాప్

Leave A Reply

Your Email Id will not be published!