#INDvsNZ : కీవీస్ తో యుద్దానికి భార‌త్ సిద్దం

టెస్టు ఛాంపియ‌న్ తో తాడో పేడో

IND vs NZ : త‌ట‌స్థ వేదిక‌గా ఇంగ్లండ్ లో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ లో ఘోరంగా ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న భార‌త జ‌ట్టు(IND vs NZ) స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవ‌డంతో అత‌డి స్థానంలో అజింక్యా ర‌హానేకు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది బీసీసీఐ.

ఇక టీ20 సీరీస్ ను కోల్పోయిన కీవీస్ ఎలాగైనా టెస్టు గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

మ‌రో వైపు మోచేతి గాయంతో రెస్ట్ లో ఉన్న న్యూజిలాండ్ స్కిప్ప‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ తిరిగి టెస్ట్ మ్యాచ్ కు రానున్నాడు.

ఆ జ‌ట్టు అన్ని ఫార్మాట్ ల‌లో బ‌లంగా ఉంది. కీవీస్(IND vs NZ) రెండు మ్యాచ్ లు ఆడ‌నుంది.

మొద‌టి టెస్టు మ్యాచ్ ఇవాళ్టి నుంచి కాన్పూర్ వేదిక‌గా ప్రారంభం కానుంది.

కొత్త కెప్టెన్ తో పాటు కొత్త గా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కొలువు తీర‌డం భార‌త్ కు అగ్ని ప‌రీక్షగా మారింది.

మ‌రో వైపు కీల‌క‌మైన ఓపెనర్ కేఎల్ రాహుల్ కు గాయం కావ‌డంతో ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఇది ఒక ర‌కంగా పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక అటాకింగ్ లోనూ టాప్ లో ఉంది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు.

స్వ‌దేశంలో భార‌త్ ను ఓడించాలంటే చాలా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంది. ఆ విష‌యం కేన్ విలియ‌మ్స‌న్ కు బాగా తెలుసు. టీమిండియా ముగ్గురు స్పిన్న‌ర్ల‌ను రంగంలోకి దించింది.

ఇప్ప‌టికే పిచ్ ను ప‌రిశీలించారు ద్ర‌విడ్. 2016లో జ‌రిగిన సీరీస్ లో మూడు టెస్టు మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ ఓట‌మి పాలైంది. మ‌యాంక్ అగ‌ర్వాల్ తో క‌లిసి శుభ్ మ‌న్ గిల్ ఓపెనింగ్ కు వ‌స్తాడ‌ని హెడ్ కోచ్ డిక్లేర్ చేశాడు.

పుజారా, ర‌హానే కుదురుకుంటే స్కోర్ పెర‌గ‌డం ఖాయం. పేస‌ర్ల‌లో ష‌మీ, సిరాజ్ , ఇషాంత్ ఆడ‌నున్నారు.

Also Read : ద్ర‌విడ్ లో అదే జోరు అదే జోష్

Leave A Reply

Your Email Id will not be published!