#BabarAzam : ప్ర‌తిసారీ ర‌న్స్ చేయాలంటే క‌ష్టం

స్ప‌ష్టం చేసిన బాబ‌ర్ ఆజ‌మ్

Babar Azam  : పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. త‌న ఫామ్ పై వ‌స్తున్న కామెంట్స్ పై స్పందించాడు. బంగ్లాదేశ్ ను టీ20 సీరీస్ లో వైట్ వాష్ చేసింది.

అంతే కాకుండా ఐసీసీ20 ర్యాంకింగ్స్ లో వ‌రుస‌గా బ్యాట‌ర్ ల‌లో టాప్ లో ఉంటూ వ‌చ్చాడు బాబ‌ర్ ఆజ‌మ్. కానీ బంగ్లా తో జ‌రిగిన ఈ సీరీస్ లో మ‌నోడు మూడు మ్యాచ్ లు క‌లుపుకొని కేవ‌లం 27 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఆజ‌మ్ చేసింది ఫ‌స్ట్ మ్యాచ్ లో 7 ప‌రుగులు చేస్తే రెండో మ్యాచ్ లో కేవ‌లం ఒక ప‌రుగుతో స‌రి పెట్టుకున్నాడు. ఇక మూడో మ్యాచ్ లో 19 ప‌రుగులు చేసి నిరాశ ప‌రిచాడు. దీంతో బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam )కు ఏమైందంటూ నెటిజ‌న్లు, క్రికెట్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు.

ఈ సంద‌ర్భంగా సీరియ‌స్ గా స్పందించాడు ఈ కెప్టెన్. టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతోంది పాకిస్తాన్ టీం. దీంతో మీడియాతో వ‌ర్చువ‌ల్ గా స‌మావేశ‌మైన బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam )ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

త‌న ఫామ్ గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు. ప్ర‌తిసారీ ప‌రుగులు చేయాలంటే క‌ష్ట‌మ‌ని పేర్కొన్నాడు. ప్ర‌తి ప్లేయ‌ర్ కు బాగానే ఆడాల‌ని ఉంటుంది. ఒక్కోసారి వ‌ర్క‌వుట్ అవుతుంది మ‌రోసారి కాద‌న్నాడు.

రెండు మూడు మ్యాచ్ ల్లో విఫ‌ల‌మైతే ఇలా ట్రోల్ చేస్తారా అంటూ ప్ర‌శ్నించాడు బాబ‌ర్ ఆజ‌మ్. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే టెస్టు సీరీస్ పై ఫోక‌స్ ఉంద‌న్నాడు. గ‌డిచిన మ్యాచ్ ల గురించి ఆలోచించ‌న‌ని చెప్పాడు.

Also Read : కీవీస్ తో యుద్దానికి భార‌త్ సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!