#Kuwait : భార‌తీయుల‌కు కువైట్ బిగ్ షాక్

టూరిస్ట్ వీసాల జాబితాలో ఇండియా ఔట్

Kuwait  ; కువైట్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశాన్ని సంద‌ర్శించే భార‌తీయ టూరిస్టుల‌కు చేదు క‌బురు చెప్పింది. టూరిస్టు వీసాల జారీకి సంబంధించి కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

త‌మ దేశానికి వ‌చ్చేందుకు గాను 53 దేశాల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. వీరితో పాటు జీసీసీలో ఉన్న దేశాల్లో వారికి కూడా ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. ఆన్ లైన్ లో ఇ- వీసాలు (Kuwait )జారీ చేయ‌నుంది ఆ ప్ర‌భుత్వం.

కాగా టూరిస్టు వీసాలు ఇచ్చేందుకు అవ‌కాశం ఇస్తున్న దేశాల జాబితాలో భార‌త్ ను ప‌క్క‌న పెట్టింది. ఇదిలా ఉండ‌గా కువైట్ లో పెద్ద ఎత్తున మ‌నోళ్లు ప‌ని చేస్తున్నారు.

ప్ర‌ధానంగా భ‌వ‌న నిర్మాణాల‌లో అధిక శాతం నిమ‌గ్న‌మై ఉన్నారు. అయినా ఎందుక‌నో ఇండియాపై కువైట్(Kuwait )శీత‌క‌న్ను వేసింది. వీరితో పాటు వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు, మేధావులు, ఐటీ ఎక్స్ ప‌ర్ట్స్ ఇలా ప్ర‌తి రంగానికి చెందిన ఇండియ‌న్స్ కువైట్ లో కొలువుతీరారు.

కానీ వివ‌క్షా పూరితంగా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం కొంత విస్తు పోయేలా చేసింది. ఇక ఆ కంట్రీ ప‌ర్మిష‌న్ ఇచ్చిన ఆ దేశాల్లో అత్య‌ధికంగా యూర‌ప్ , అమెరికా ఖండాల‌కు చెందిన‌వే ఉన్నాయి.

ఆసియాకు సంబంధించి జీసీసీ లో స‌భ్యత్వం ఉన్న దేశాల‌కే ప్ర‌యారిటీ ఇచ్చింది. ఇక ప్ర‌క‌టించిన లిస్టులో క‌న్స‌ల్టెంట్స్ , డాక్ల‌ర్టు, ఇంజ‌నీర్లు, లాయ‌ర్లు, జ‌డ్జీలు, పీపీలు, యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్లు ఉన్నారు.

వీరితో పాటు ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్ , కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్స్ , సిస్టం అన‌లిస్ట్ లు, మేనేజ‌ర్స్ , వ్యాపార‌వేత్త‌లు, త‌దిత‌రుల‌కు చాన్స్ ఇచ్చింది కువైట్.

Also Read : అమెరికాను నెట్టేసిన డ్రాగ‌న్

Leave A Reply

Your Email Id will not be published!