#BajireddyGovardan : ‘దేవుడా’ ఆర్టీసీని కాపాడమ‌ని కోరా

టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి

Bajireddy Govardan  : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ చైర్మ‌న్ బాజి రెడ్డి గోవ‌ర్ద‌న్ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల చేరుకున్న ఆయ‌న ఇవాళ ఉద‌యం వీఐపీ విరామ స‌మ‌యంలో స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు

. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ ల కు మొక్కులు తీర్చుకున్నారు. ద‌ర్శనం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు.

ఆల‌య అధికారులు స్వామి వారి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా బాజి రెడ్డి గోవ‌ర్ద‌న్(Bajireddy Govardan )మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ న‌ష్టాల్లో న‌డుస్తోంద‌ని, లాభాల బాట‌లో పట్టేలా చేయాల‌ని ఆ దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని వేడుకున్నాన‌ని చెప్పారు బాజిరెడ్డి.

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణం సుర‌క్షిత‌మ‌ని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆర్టీసీ స‌ర్వీసులు త‌క్కువ‌గా న‌డిపించామ‌ని, ప్ర‌స్తుతం వాటిని పున‌రుద్ద‌రించే ప‌నిలో ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా తిరుమ‌ల‌కు అత్య‌ధికంగా బ‌స్సు స‌ర్వీసులు న‌డిపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా ఆర్టీసీలో ప్ర‌యాణం చేయాల‌ని ఇప్ప‌టికే వినూత్న‌మైన రీతిలో ప్ర‌చారం కూడా చేపట్ట‌డం జ‌రిగింద‌న్నారు. బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌డం అత్యంత సుర‌క్షిత‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళుతున్నామ‌ని పేర్కొన్నారు.

అంతే కాకుండా గ‌తంలో బ‌స్సుల‌ను హైర్ చేసుకునే వారికి ముందుగా డిపాజిట్ తీసుకునే వాళ్ల‌మ‌ని కానీ దానిని కూడా ర‌ద్దు చేశామ‌న్నారు.

సాధ్య‌మైనంత త్వ‌ర‌లో స్వామి వారి కృప‌తో , ఆశీస్సుల‌తో ఆర్టీసీ గాడిన ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్.

Also Read : ‘గురు ద్వారా’ ప్రార్థ‌న‌ల‌కు సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!