#KTR : జీహెచ్ఎంసీపై దాడి అప్రజాస్వామికం

బీజేపీ కార్పొరేట‌ర్ల తీరుపై కేటీఆర్ ఫైర్

KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ – జీహెచ్ఎంసీ ఆఫీసుపై భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కార్పొరేట‌ర్లు దాడి చేశారు ఇటీవ‌ల‌.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు కేటీఆర్(KTR). ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే ప్ర‌స్తావించాల్సింది పోయి ఏకంగా దాడికి దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ఆఫీసుపై పాల్ప‌డిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీ అంజ‌నీ కుమార్ ను కోరారు.

ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పై దాడులు చేసేందుకేనా అని ప్ర‌శ్నించారు కేటీఆర్(KTR). ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల్సింది పోయి దాడుల‌కు పాల్ప‌డ‌తారా అంటూ మండిప‌డ్డారు.

కాగా బ‌ల్దియా కార్యాల‌యంలో గూండాగిరి చేసిన బీజేపీ కార్పొరేట‌ర్లు, వారి అనుచ‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా సైఫాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

ద‌ర్యాప్తులో భాగంగా జీహెచ్ఎంసీ కార్యాల‌యం ప‌రిస‌ర ప్రాంతాల‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలు ప‌రిశీలించారు. కేసు ఘ‌ట‌న‌కు సంబంధించి 32 మందిని గుర్తించారు పోలీసులు.

మ‌రి కొంద‌రిని గుర్తించే ప‌నిలో ఉన్నారు. నిందితుల‌పై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సెంట్ర‌ల్ జోన్ జాయిట్ సీపీ విశ్వ ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

కాగా రాం న‌గ‌ర్ , ముసారాంబాగ్ , బేగం బ‌జార్ , ఆర్కే పురం, గ‌న్ ఫౌండ్రీ , మ‌ల్కాజిగిరి , త‌దిత‌ర డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు విధ్వంస కాండ‌లో ప్ర‌ధాన పాత్ర పోషించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు.

Also Read : పేద‌ల‌కు వ‌రం ఉచిత రేష‌న్ ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!