#VCSajjanar : మొగుల‌య్య గానం ఆర్టీసీ బ‌హుమానం

ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యం క‌ల్పించిన ఎండీ

VC Sajjanar  : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా కొలువు తీరిన సజ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గాడి త‌ప్పిన ఆర్టీసికి చికిత్స చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఇప్ప‌టికే శుభ కార్యాలు, తీర్థ యాత్రలు, త‌దిత‌ర వాటి కోసం బుకింగ్ చేసుకునే ఆర్టీసీ బ‌స్సుల‌కు సంబంధించి డిపాజిట్లు లేకుండా చేశారు. ఎవ‌రైనా బుక్ చేసుకోవ‌చ్చు.

గ‌తంలో డిపాజిట్ కంప‌ల్స‌రీగా ఉండేది. అటు సిబ్బందికి, ఇటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎవ‌రైనా స్పందించినా లేదా స‌మ‌స్య‌ల గురించి తెలియ చేసినా వెంట‌నే స్పందిస్తున్నారు.

ఈ మేర‌కు త‌మ సిబ్బందిని, ఉన్న‌తాధికారుల‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కిన్నెర వాయిద్య క‌ళాకారుడిగా ఇప్ప‌టికే పేరొందిన ఉమ్మడి పాల‌మూరు జిల్లాకు చెందిన మొగుల‌య్య‌ను గుర్తించారు ఎండీ సజ్జ‌నార్(VC Sajjanar ).

ఆయ‌న‌కు జీవితంతాం గుర్తంచుకునేలా ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. ఇటీవ‌ల ఆయ‌న ఆర్టీసీ సేవ‌ల‌ను ప్ర‌శంసిస్తూ పాట పాడారు. బ‌స్సుల‌కు ప్ర‌జ‌ల‌తో ఉన్న బంధాన్ని పెన వేసుకున్న వైనాన్ని ఆయ‌న హృద్యంగా ఆలాపించారు.

మొగుల‌య్య పాట‌కు పెద్ద ఎత్తున స్పందన ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేసింది. వ్యూస్ కూడా భారీగా వ‌చ్చాయి.

త‌న కూతురు పెళ్లి కోసం ఆర్టీసీ బ‌స్సును బుక్ చేసుకున్నారు. బ‌స్సు ముందు నిల‌బ‌డి పాట పాడిన పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సంస్థ‌కు సానుకూలంగా ప్ర‌చారం చేసినందుకు మొగుల‌య్య‌ను అభినందించారు ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్(VC Sajjanar ). ఇక నుంచి ఎక్క‌డికి వెళ్లినా బ‌స్సుల గురించి పాడుతూ ప్ర‌చారం చేయాల‌ని కోరారు.

Also Read : ఎమ్మెల్సీగా ‘క‌ల్వ‌కుంట్ల క‌విత’ ఏక‌గ్రీవం

Leave A Reply

Your Email Id will not be published!