#PrashantKishor : ముకుల్ సంగ్మా వెనుక పీకే

కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షాక్

Prashant Kishor : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ ఎప్పుడు ఎలా వ్యూహాలు ప‌న్నుతారో ఎవ‌రికీ తెలియ‌దు. నిన్న‌టి దాకా ఆయ‌న కాంగ్రెస్ తో ఉన్నారు. కానీ పీకేను ఏఐసీసీ పెద్ద‌లు ప్ర‌ధానంగా సోనియా, రాహుల్, ప్రియాంక అనుమానంగా చూశారు.

అయినా త‌న ప్ర‌య‌త్నాలు విర‌మించు కోలేదు పీకే. భార‌త దేశంలో ఆక్టోప‌స్ లా పాతుకు పోయిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కి ఉన్న శ‌క్తి ఒక్క‌టే స‌రిపోద‌ని గ్ర‌హించారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor).

అందుకే భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌ను ఒకే తాటి పైకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ పీకే బ‌లాన్ని చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేసింది ఏఐసీసీ.

దీంతో ఆయ‌న మెల మెల్ల‌గా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడుతూ వ‌స్తున్నారు.

రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో దేశంలో మ‌ళ్లీ అధికారాన్ని చేజిక్కించు కోవాల‌ని అనుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు డైల‌మాలో ప‌డేలా చేశారు.

కొత్త వ్య‌క్తుల‌ను తెర ముందుకు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా గోవాలో కాంగ్రెస్ మాజీ సీఎం టీఎంసీలో చేరేలా చేశారు.

ఇందుకు ప్ర‌త్యామ్నాయంగా దేశంలో మోదీకి దీదీని ఎదుర్కొనే ప్లాన్ చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది.

ఢిల్లీలో బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ సైతం టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక త‌మిళ‌నాడుకు చెందిన ఎంపీ సుబ్ర‌మ‌ణ్యియ‌న్ స్వామి దీదీని క‌లిసేలా చేశారు.

ఇది క‌ల‌క‌లం రేపింది. ఎన్న‌డూ లేని రీతిలో స్వామి మమ‌తా ను ఆకాశానికి ఎత్తేశారు.

ఇదే స‌మ‌యంలో ఈశాన్య రాష్ట్రాల‌లో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ కొట్టే ప‌నిలో ప‌డ్డారు పీకే.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌లో మాజీ సీఎం ముకుల్ సంగ్మా వెనుక ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) ఉన్నార‌నేది వాస్త‌వం.

ఇదే విష‌యాన్ని ముకుల్ మీడియా సాక్షిగా పీకే త‌న‌కు కావాల్సిన స్నేహితుడిగా పేర్కొన్నాడు. ఆయ‌న సార‌థ్యంలో 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో జంప్ అయ్యారు.

మొత్తంగా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమిట‌నేది చూడాల్సి ఉంది.

Also Read : రాబోయే ఎన్నిక‌ల్లో రైతులే కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!