#RahaneWilliamson : ఆట‌ లోనే కాదు వ్య‌క్తిత్వం లోనూ భేష్

మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ మిస్ట‌ర్ కూల్

Rahane Williamson  : వాళ్లిద్ద‌రూ ఇవాళ త‌ల‌ప‌డ బోతున్నారు. వాళ్లెవ‌రో కాదు దిగ్గ‌జ ఆట‌గాళ్లుగా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్న వాళ్లు. వాళ్లే ఒక‌రు భార‌త క్రికెట్ టెస్టు జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్న ముంబైకి చెందిన అజింక్యా ర‌హానే. మ‌రొక‌రు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ద‌క్కేలా చేసిన కేన్ విలియ‌మ్స‌న్.

వీరిద్ద‌రినీ ఒక‌రితో మ‌రొక‌రిని పోల్చ‌డంలో త‌ప్పేమీ లేదు. ఎందుకంటే ఇద్ద‌రూ ప్ర‌శాంతంగా ఉంటారు.

ఎలాంటి భావోద్వేగాల‌కు లోనుకాని మ‌న‌స్త‌త్వం వీరిద్ద‌రిది. అందుకే వీరి సార‌థ్యంలో ఎలాంటి ఆధిప‌త్య ధోర‌ణి క‌నిపించ‌దు.

అటు మోము లోనూ ఇటు ఆట లోనూ ఒకేలా ఉంటుంది వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న‌. కొంద‌రు ఫీలింగ్స్ ను దాచుకోలేరు.

సంతోషం వ‌చ్చినా త‌ట్టుకోలేరు. కానీ ర‌హానే, విలియ‌మ్స‌న్ లు మాత్రం ఓట‌మిని, విజ‌యాన్ని ఒకేలా చూస్తారు. ఆట‌ను ఆట‌గానే ఆడ‌తారు.

దానిని ఓ యుద్ధంగానో లేదా ఒక‌రిపై ఆధిప‌త్యంగానో చూడ‌రు. ఇలాంటి మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉండ‌డం ఆట‌గాళ్ల‌లో చాలా అరుదు.

అయిన దానికి కాని దానికి అర‌వ‌డాలంటూ ఏమీ ఉండ‌వు.

చాలా కూల్ గా మ్యాచ్ లు కొన‌సాగేందుకే ఎక్కువ ఫోక‌స్ పెడ‌తారు. అందుకే వీరిద్ద‌రినీ క్రికెట్ ను చూసిన వాళ్లు,

గ‌మ‌నించిన వాళ్లు , అభిమానులు, నెటిజ‌న్లు మాత్రం అజింక్యా ర‌హానే(Rahane Williamson ) మిస్ట‌ర్ కూల్ అని కేన్ విలియ‌మ్స‌న్ ను మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అంటారు.

అంతే కాదు ఎవ‌రైనా ఆప‌ద‌లో ఉన్నారంటే వారికి స‌హాయం చేయడంలో కేన్ ముందుంటాడు.

ఇక ర‌హానే కు దేశం అన్నా, భార‌త జాతీయ ప‌తాకం ( మువ్వొన్నెల జెండా ) అంటే చ‌చ్చేంత ఇష్టం.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఆట‌గాడి కంటే ముందు ర‌హానే దేశ భ‌క్తుడిగా పేర్కొన‌వ‌చ్చు.

క‌రోనా కాలంలో త‌ను సైతం తోడుగా ఉన్నాడు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లే ఆట‌కు కావాలి. ఆట స‌హ‌జం.

కానీ వ్య‌క్తిత్వం అజ‌రామ‌రం. మ‌నిషికి గుర్తింపు ఆట‌తో రావ‌చ్చు గాక‌.

కానీ వారు ప్ర‌వ‌ర్తించిన తీరు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్ఫూర్తి దాయ‌క‌మైన జీవిత‌మే ఎంద‌రినో ప్ర‌భావితం చేస్తుంది.

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు కోచ్ గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ కూడా అంతే. అంత‌కు ముందు భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన హైదరాబాదీ అజ్జూ భాయ్ సైతం ఎక్క‌డా గొడ‌వ ప‌డిన సంద‌ర్భాలు లేవు.

ఏది ఏమైనా ర‌హానే, విలియ‌మ్స‌న్ లు మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్.

Also Read : సోషలిజం నుంచి హిందుత్వ వైపు

Leave A Reply

Your Email Id will not be published!