#RakeshTikait : ‘టీఆర్ఎస్’ పై తికాయ‌త్ క‌న్నెర్ర‌

బీజేపీకి కేసీఆర్ న‌మ్మిన బంటు

Rakesh Tikait : రైతు సంఘం నాయ‌కుడు, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్ర‌తినిధి రాకేశ్ తికాయ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ రైతు ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ఇవాళ ఇందిరా పార్కు వ‌ద్ద విప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో మ‌హా ధ‌ర్నా చేప‌ట్టారు.

ఈ ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి రాకేశ్ తికాయ‌త్ (Rakesh Tikait) ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోదీ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ పై మండి ప‌డ్డారు.

అదే స‌మ‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి తెలంగాణ రాష్ట్ర స‌మితి బీ పార్టీ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీకి కొమ్ము కాసే టీఆర్ఎస్ ను ఢిల్లీకి పంప‌వ‌ద్ద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణ‌లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన రైతుల‌కు ముందు న‌ష్ట పరిహారం ఇవ్వాల‌ని రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేంత వ‌ర‌కు రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

రైతు ఉద్య‌మం ఒక ప్రాంతానికి కాద‌ని, పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ప్ర‌క‌టించేంత దాకా ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎంఎస్పీపై పార్ల‌మెంట్ లో చ‌ట్టం వ‌చ్చేంత దాకా పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ఏడాది కాలంగా తాము ఆందోళ‌న చేప‌ట్టినా ఈ రోజు వ‌ర‌కు త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన దాఖ‌లాలు లేవ‌న్నారు. సీఎం కేసీఆర్ ఇక్క‌డ ఒక మాట మాట్లాడ‌తార‌ని, ఢిల్లీకి వ‌చ్చి మోదీతో దోస్తీ చేస్తార‌ని ఆయ‌న‌ను తాము న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : సోష‌ల్ మీడియా కంటెంట్ పై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!