#Sidhu : ‘చ‌న్నీ స‌ర్కార్’ పై సిద్దూ యుద్దం

డ్ర‌గ్స్ వివ‌రాలు వెల్ల‌డించ‌క పోతే దీక్ష

Sidhu : పంజాబ్ లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి చెందిన పీసీసీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ (Sidhu)నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌జ‌ల ప‌క్షం ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీకి డెడ్ లైన్ విధించారు. ఆయ‌న త‌న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

డ్ర‌గ్స్ ( మాద‌క ద్ర‌వ్యాలు ) మ‌హ‌మ్మారిపై ప్ర‌భుత్వం నివేదిక‌లు వెంట‌నే బ‌హిర్గ‌తం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య గురించి రాస్ట్ర ఏజెన్సీలు పూర్తి నివేదిక‌ల‌ను హైకోర్టుకు స‌మ‌ర్పించాయ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వం వెంట‌నే ఆ వివ‌రాలు ఏమిటో, దాని వెనుక శ‌క్తులు ఏమిటో స్ప‌ష్టం చేయాల్సిన బాధ్య‌త ప్ర‌స్తుత సీఎం చ‌న్నీపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సిద్దూ(Sidhu).

ఒక వేళ ఆ నివేదిక‌ల‌ను గ‌నుక బ‌హిర్గ‌తం చేయ‌క పోతే తాను నిరాహార‌దీక్ష చేప‌డ‌తాన‌ని సీఎంకు వార్నింగ్ ఇచ్చారు. డ్ర‌గ్స్ నిర్మూలిస్తామ‌ని ఎన్నిక‌ల్లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, ఈ విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేస్తున్నాన‌ని చెప్పారు.

ఈ నివేదిక‌ల‌పై గ‌తంలో సీఎంగా ప‌ని చేసిన కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఎందుకు తొక్కి పెట్టి ఉంచారో ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని డిమాండ్ చేశారు సిద్దూ.

ఇప్ప‌టికే 2017 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 13 పాయింట్ల ఎజెండా గురించి చ‌ర్చించాల‌ని కోరుతూ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు.

Also Read : టీఎంసీలో చేరిన మాజీ సీఎం, ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!