#AkhileshJayanth : యూపీలో ‘పొత్తుల ప‌ర్వం’ గ‌రం గ‌రం 

ఎస్పీ, ఆర్ఎల్డీ మ‌ధ్య కుదిరిన ఒప్పందం 

Akhilesh Jayanth : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఇప్ప‌టికే అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని చూస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ల‌క్నోను కేంద్రంగా చేసుకుని ప్ర‌చారంలో బిజీగా మారారు. బీఎస్పీతో పాటు ఎంఐఎం కూడా ఈసారి బ‌రిలో దిగ‌నుంది.

ఈ త‌రుణంలో స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్(Akhilesh Jayanth) ఈసారి ఎన్నిక‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు.

ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధానంగా బీజేపీ నేతృత్వంలోని యోగి పాల‌న‌ను ఎండ‌గ‌డుతూ వ‌స్తున్నారు.

ప‌నిలో ప‌నిగా చిన్న పార్టీల‌తో పొత్తు కుదుర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఆ విధంగానే భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో ములాఖ‌త్ అవుతున్నారు.

సీట్ల షేరింగ్ విష‌యంపై ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించ‌క పోయినా ఏదో ర‌కంగా క‌లుపుకుని యోగికి చెక్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

తాజాగా ఎస్పీ, ఆర్ఎల్డీ కూట‌మి రాష్ట్రంలో అత్య‌ధిక ఓటు బ్యాంకు క‌లిగిన జాట్ లు, ముస్లింల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ రెండు పార్టీల కూట‌మితో బీజేపీ ఓటు బ్యాంక్ ను చీల్చే ప్ర‌మాదం ఉంది.

సమాజ్ వాది చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , రాష్ట్రీయ లోక్ ద‌ళ్ చీఫ్  జ‌యంత్ సింగ్ చౌద‌రిలు ఒప్పందం చేసుకున్నారు.

ఈ మేర‌కు క‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఆర్ఎల్డీ కంచు కోట‌గా భావించే ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్,

మ‌థుర‌, బులంద్ ష‌హ‌ర్ , అలీఘ‌ర్ , బాగ్ ప‌త్ తో స‌హా ప‌శ్చిమ యూపీలోని ఎస్పీ 30 నుంచి 36 సీట్ల‌ను వ‌దులుకునే చాన్స్ ఉంద‌ని అంచ‌నా.

సాగు  చ‌ట్టాల ర‌ద్దు త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మార‌నున్నాయి యూపీలో. ప్ర‌ధానంగా రైతులు ఎటు వైపు మొగ్గు చూపుతార‌నే దానిపై అన్ని పార్టీలు వేచి చూస్తున్నాయి.

ఏది ఏమైనా ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీల మ‌ధ్య పొత్తు బీజేపీకి ఇబ్బందిక‌ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వీరిద్ద‌రి పొత్తు అటు బీజేపీనే కాకుండా కాంగ్రెస్, బీఎస్పీ ఓటు బ్యాంకును గండికొట్టే చాన్స్ లేక పోలేదు.

ఏది ఏమైనా స‌మాజ్ వాది పార్టీకి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం కాషాయ శ్రేణుల‌ను గుబులు పుట్టిస్తోంది.

Also Read : పంజాబ్ లో ‘పాగా’ వేసేదెవ్వ‌రో

Leave A Reply

Your Email Id will not be published!