#AAPSP : ఆప్ ఎంపీతో అఖిలేష్ భేటీ

మారుతున్న యూపీ స‌మీక‌ర‌ణాలు

AAP SP : ఉత్త‌ర ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎం బ‌రిలో ఉన్నాయి. ఈసారి పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

అధికారంలో ఉన్న భారతీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని య‌త్నిస్తోంది. ప్ర‌ధానంగా స‌మాజ్ వాది పార్టీ(AAP SP) వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

ప్ర‌ధాన పార్టీల‌తో కాకుండా చిన్న పార్టీల‌తో మాత్ర‌మే తాము ఈసారి ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటున్న‌ట్టు ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఆయ‌న ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభించారు.

ఇప్ప‌టికే భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో చ‌ర్చిస్తున్నారు. తానే ముందుండి ఆహ్వానం ప‌లుకుతున్నారు. జ‌యంత్ చౌద‌రి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ ద‌ళ్ – ఆర్ఎల్డీ తో ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు అఖిలేష్ యాద‌వ్.

గతంలో ఎన్డేయేతో జ‌త క‌ట్టిన సుహ‌ల్ దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ(AAP SP) – ఓం ప్ర‌కాశ్ రాజ్ భ‌ర్ ని త‌మ వైపున‌కు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ తో భేటీ అయ్యారు.

ఎస్పీ, ఆప్ మ‌ధ్య పొత్తు కుద‌ర‌డం ఒక ర‌కంగా వ్యూహాత్మ‌కంగా ఓ అడుగు ముందుకు ప‌డిన‌ట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా యూపీలో ఆప్ న‌కు పెద్ద‌గా ప‌ట్టు లేక పోయినా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మ‌ద్ద‌తు ఉండ‌డం కూడా ఎస్పీకి క‌లిసి వ‌చ్చే అంశంగా భావిస్తున్నారు అఖిలేష్ యాద‌వ్.

మ‌రో వైపు అప్నా ద‌ళ్ – కె నాయ‌కురాలు కృష్ణ ప‌టేల్ తో భేటీ అయ్యారు అఖిలేష్ యాద‌వ్ . ఆ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు, అనుప్రియ‌తో క‌లిసి మూడు ఎంపీలు ఉన్నారు. సామాజికంగా వెనుక‌వ‌డిన వ‌ర్గ‌మైన కుర్మీల‌కు ప‌ట్టుంది ఆ పార్టీకి.

Also Read : 29న ట్రాక్ట‌ర్ల‌తో పార్ల‌మెంట్ కు మార్చ్

Leave A Reply

Your Email Id will not be published!