#T20WorldCup : ‘టెలికాస్ట్’ లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ రికార్డ్

ప్రపంచ వ్యాప్తంగా 167 మిలియ‌న్ల వ్యూవ‌ర్ షిప్

T20 World Cup : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World Cup) ఫైన‌ల్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వీక్షించార‌ని తెలిపింది ఐసీసీ.

మొత్తం 16 జ‌ట్లు పాల్గొన్నాయి. ఫైన‌ల్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేరుకున్నాయి.

ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో కీవీస్ ను ఓడించి క‌ప్ కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున ఈ మ్యాచ్ ను చూశార‌ని వెల్ల‌డించింది.

భార‌త‌దేశంతో పాటు పాకిస్తాన్ , యూకే, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు ప్ర‌పంచంలోని 95 శాతం దేశాలు ఈ ఫైన‌ల్ మ్యాచ్ ను వీక్షించార‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది.

ప్ర‌సార మాధ్య‌మాలు (టీవీలు ) , డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ల‌లో దాదాపు 10 వేల గంట‌ల పాటు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశార‌ని తెలిపింది.

యూఏఈ, ఒమ‌న్ ల‌లో ఇప్ప‌టి దాకా జ‌రిగిన ఈవెంట్ల‌లో 2021లో జ‌రిగిన ఈవెంట్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింద‌ని స్ప‌ష్టం చేసింది ఐసీసీ.

అనేక ప్రాంతాల‌లో వీక్ష‌కుల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింద‌ని పేర్కొంది. వీటిలో టెలివిజ‌న్ రీచ్ 167 మిలియ‌న్ల రికార్డు స్థాయికి చేరింద‌ని తెలిపింది.

స్టార్ ఇండియాలో ఇండియాలో 15.9 బిలియ‌న్ నిమిషాల రికార్డు న‌మోదు చేసింద‌ని వెల్ల‌డించింది ఐసీసీ.

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్(T20 World Cup) ను వీక్షించార‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త దేశంలో 2016లో జ‌రిగిన ఐసీసీ ఈవెంట్ ను వీక్ష‌ణ ప‌రంగా మించి పోయింద‌ని స్ప‌ష్టం చేసింది.

డిజిట‌ల్ వినియోగంలో డిస్నీ, హాట్ స్టార్ ల‌లో వీక్ష‌ణంలో రికార్డు సాధించింద‌ని తెలిపింది.

యూకేలో భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్ ను అత్య‌ధికంగా వీక్షించారు. ఇక అమెరికాలో స్పోర్ట్స్ చాన‌ల్ లో ఈ మ్యాచ్ ను భారీగా చూశార‌ని తెలిపింది. అత్య‌ధిక స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఐసీసీ సిఇఓ జెఫ్ అల్లాడైస్.

Also Read : భార‌త్ బ్యాటింగ్ కీవీస్ బౌలింగ్

Leave A Reply

Your Email Id will not be published!