#Chiranjeevi : టికెట్ల విష‌యంలో పున‌రాలోచించాలి

ఏపీ స‌ర్కార్ కు మెగాస్టార్ సూచ‌న

Chiranjeevi  : సినిమా టికెట్ల విష‌యంలో ఏపీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ప‌రిశ్ర‌మ కోరిన విధంగా పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్ట‌డం మంచిదేన‌ని పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో థియేర‌ట్ల మ‌నుగ‌డ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు త‌గ్గించిన రేట్ల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తే బావుంటుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు.

దేశ‌మంతా ఒక‌టే జీఎస్టీ ట్యాక్స్ లు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న‌ప్పుడు టికెట్ ధ‌ర‌ల‌లో కూడా అదే వెసులుబాటు ఉండాల‌ని పేర్కొన్నారు చిరంజీవి. ద‌య‌చేసి ఈ విష‌యంపై మ‌రోసారి ఏపీ స‌ర్కార్ పున‌రాలోచించాల‌ని ఆయ‌న కోరారు.

ప్రోత్సాహం ఉన్న‌ప్పుడే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుగోగ‌లుగుతుంద‌ని చిరంజీవి(Chiranjeevi )ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఏపీ అసెంబ్లీలో స‌మాచార, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి సినిమా బిల్లుకు సంబంధించిన చ‌ర్చ‌లో పాల్గొని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రిదే ఆధిప‌త్యం న‌డుస్తోంద‌ని, దానిని చెక్ పెట్టాలంటే ఆన్ లైన్ టికెట్ విధానం బెట‌ర్ అని పేర్కొన్నారు. అంతే కాకుండా త‌మ ఇష్టానుసారం థియేట‌ర్ల‌లో షోస్ వేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రోజుకు నాలుగు ఆట‌లు మాత్ర‌మే ఆడేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. అందులో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్న తేడా ఉండ కూడ‌ద‌ని పేర్కొన్నారు.

అన్ని సినిమాల‌కు ఒక‌టే రేటు ఉంటేనే బావుంటుంద‌న్నారు. మిడ్ నైట్ షోస్ , బినిఫిట్ షోస్ , స్పెష‌ల్ షోస్ అంటూ ఇక ఉండ‌బోవ‌న్నారు.

సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి నిధుల సేక‌ర‌ణ కోస‌మైతేనే బెన్ ఫిట్ షోస్ కు ప‌ర్మిష‌న్ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

Also Read : రైతుల‌పై కామెంట్ కంగ‌నాపై కేసు

Leave A Reply

Your Email Id will not be published!