#VarlaRamaiah : ఎన్టీఆర్ పై వ‌ర్ల రామ‌య్య ఫైర్

జూనియ‌ర్ పై సంచ‌ల‌న కామెంట్స్

Varla Ramaiah : ప్ర‌ముఖ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య(Varla Ramaiah) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి వైసీపీ నేత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ విజ‌య‌వాడ‌లో ఆయ‌న దీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి పై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ విమ‌ర్శ‌లు చేస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు స‌రిగా లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు వ‌ర్ల రామ‌య్య‌(Varla Ramaiah).

భువ‌నేశ్వ‌రి మేన‌ల్లుడిగా ఎన్టీఆర్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని ఆరోపించారు. మేన‌త్త‌ను నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంటే మేన‌ల్లుడిగా ఆయ‌న స‌రిగా స్పందించ లేద‌ని అన్నారు.

ఆనాడే వారిని నియంత్రించి ఉంటే ఇంత దాకా వ‌చ్చి ఉండేది కాద‌న్నారు. ఇదే విష‌యాన్ని రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు అనుకుంటున్నార‌ని చెప్పారు వ‌ర్ల రామ‌య్య‌.

సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువ‌ల‌ను వ‌దులుకుంటారా అని ఆయ‌న నిల‌దీశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫోటోలు పెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్ ఘాటుగా స్పందించి ఉండాల్సి ఉంద‌న్నారు.

బూతుల మంత్రి పేర్ని నానికి ఎన్టీఆర్ అంటే భ‌య‌మ‌ని, అలాంటి వారిని కంట్రోల్ చేసే శ‌క్తి ఆయ‌న‌కే ఉంద‌న్నారు. పార్టీకి అండ‌గా ఉన్న వాళ్లే టీడీపీ స‌భ్యుల‌ని వ‌ర్ల స్ప‌ష్టం చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌తో పార్టీకి సంబంధం లేద‌ని , ఈ వ్యాఖ్య‌లు పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా వ‌ర్ల రామ‌య్య కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ చెబితే తాము కంట్రోల్ లో ఉన్నామ‌ని చెప్ప‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : నానితో పాటు ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త పెంపు

Leave A Reply

Your Email Id will not be published!