#MamataBanerjee : ‘బీఎస్ఎఫ్ ప‌రిధి’ని విర‌మించుకోండి

పీఎం మోదీకి సీఎం దీదీ విన్న‌పం

Mamata Banerjee : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)బిజీ బిజీగా ఉన్నారు. ఆమెను ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌న్ స్వామి క‌లుసుకున్నారు.

ఇదే  స‌మ‌యంలో మాజీ క్రికెట‌ర్ , మాజీ ఎంపీ కీర్తి ఆజాద్ , మ‌రో మాజీ కాంగ్రెస్ ఎంపీ మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)స‌మ‌క్షంలో టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం దీదీ ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో భేటీ అయ్యారు.

ప్ర‌ధానంగా స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ – బీఎస్ఎఫ్ అధికార ప‌రిధి పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిని ఆమె పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నారు.

మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ కూడా అభ్యంత‌రం తెలిపారు. ఆ రాష్ట్రం ఏకంగా వ్య‌తిరేకంగా తీర్మానం కూడా చేసింది.

మోదీతో జ‌రిగిన స‌మావేశంలో దీదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు నుంచి 15 కిలోమీట‌ర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ ప‌రిధిని 50 కిలో మీట‌ర్ల‌కు పెంచుతూ జారీ చేసిన ఉత్త‌ర్వులను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

బీఎస్ఎఫ్ కు మ‌రిన్ని ప‌వ‌ర్స్ క‌ట్ట‌బెడితే రాష్ట్ర ప‌రిధిలో ఉన్న శాంతి భ‌ద్ర‌త‌లకు భంగం క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. దేశ స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌కు భంగం క‌లిగించేందుకు య‌త్నించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

వ‌చ్చే ఏడాదిలో కోల్ క‌తాలో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ బిజినెస్ స‌మ్మిట్ ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో టీఎంసీ శ్రేణుల‌పై బీజేపీ దాడులు చేయ‌డాన్ని ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించాన‌ని చెప్పారు దీదీ.

Also Read : ఆదితి సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!