#YSSharmila : ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు

కేసీఆర్ ను నిల‌దీసిన ష‌ర్మిల‌

YS Sharmila : సీఎం కేసీఆర్ పై మ‌రోసారి నిప్పులు చెరిగారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. తాడో పేడో తేల్చుకుంటామ‌ని ఢిల్లీకి వెళ్లారు. తీరా ఉట్టి చేతుల‌తో తిరిగి వ‌చ్చారు. కాల‌యాప‌న త‌ప్ప చేసిందేమీ లేదు.

ఈ స‌మ‌యంలో ఇక్క‌డే ఉండి ఉంటే ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ఏవో తెలిసి ఉండేవి. మ‌రో వైపు ఆరుగాలం పండించిన ధాన్యం కొనుగోలు చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది.

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు వ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవు. ఓ వైపు కేంద్రం, ఇంకో వైపు రాష్ట్రం రైతులను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ప‌ట్ల వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిరంత‌రం రాజ‌కీయాలు చేయ‌డం ప‌త్ప రైతుల గోసను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని పేర్కొన్నారు. ఓ వైపు రైతులు తెచ్చిన పెట్టుబ‌డికి వ‌డ్డీలు క‌ట్ట‌లేక, తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆరోపించారు.

ఇప్ప‌టికైనా దొర క‌నిక‌రించాల‌ని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. వ‌రి పంట వేయొద్దంటూ చెప్ప‌డం బాధాక‌రం.

రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో కేంద్ర‌, రాష్ర ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం లేద‌ని, ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని వైఎస్ షర్మిల ఆరోపించారు.

అస‌లు సీఎం ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. దేని కోస‌మో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుని వ‌స్తాన‌ని చెప్పి చివ‌ర‌కు ఉట్టి చేతుల‌తో హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎంను నిల‌దీశారు.

Also Read : ఎమ్మెల్సీగా ‘క‌ల్వ‌కుంట్ల క‌విత’ ఏక‌గ్రీవం

Leave A Reply

Your Email Id will not be published!