#SiriShanmukh : ‘కౌగిలింత గిలిగింత’ వ‌ద్దంటే ఎలా

త‌ల్లిపై సిరి హ‌న్మంతు చిరు కోపం

Siri Shanmukh  : తెలుగు బుల్లితెర‌పై బిగ్ బాస్ -5 రియాల్టీ షో దుమ్ము రేపుతోంది. భారీ వ్యూయ‌ర్షిప్ తో దూసుకు పోతోంది. రొమాన్స్ కాస్తా ఎక్కువ కావ‌డంతో షోను ఆదరిస్తున్నారు.

ప్ర‌తి వారం ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు. ఈసారి ఎక్కువగా కాంట్రోవ‌ర్షీగా మారింది మాత్రం ఇద్ద‌రే ఇద్ద‌రు. వారే సిరి హ‌న్మంతు, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్(Siri Shanmukh ).

వీరిద్ద‌రూ బిగ్ బాస్ ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా రియాక్ట్ అవుతున్నారు. మొద‌ట్లో కొంత దూరం పాటించినా ఆ త‌ర్వాత ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేక పోతున్నారు.

కౌగిలింత‌లు, ముద్దుల‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో నెట్టింట్లో వీరి ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక తెలుగు సినిమాతో పాటు బుల్లితెర వినోద రంగాల‌న్నీ ప్రేమ పేరుతో బూతును జొప్పిస్తున్నాయి.

ఎవ‌రు అభ్యంత‌రం తెలిపినా ప‌ట్టించు కోవ‌డం లేదు ఛాన‌ళ్లు, ప్ర‌సార మాధ్య‌మాలు. కౌగిలింత‌లు, ముద్దుల సీన్స్ మ‌రీ మ‌రీ రిపీట్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో యూత్ మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ కోసం వేచి చూస్తోంది.

రాబోయే ఎపి సోడ్ లో ఇంకెన్ని హ‌గ్ లు, కిస్ లు ఉంటాయోన‌ని ఉత్కంఠ‌కు లోన‌వుతున్నారు. ఇదేం సంస్కృతి అని ప్ర‌శ్నించిన వాళ్ల‌కు ఇదే అస‌లైన జీవితం అంటూ చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఆ మ‌ధ్య నిన్ను విడిచి ఉండ‌లేనంటోంది సిరి. అయ్యో నువ్వే నా ప్రాణం అంటున్నాడు ష‌ణ్ముఖ్(Siri Shanmukh ). దీంతో రియాల్టీ షో పీక్ కు చేరింది.

ఇక బిగ్ బాస్ షోలో మొన్న కంటెస్టెంట్ కాజ‌ల్ పేరెంట్స్ హ‌ల్ చ‌ల్ చేస్తే, శ్రీ‌రామ్, మాన‌స్ , సిరి ఇంటి స‌భ్యులు సంద‌డి చేశారు. మొత్తంగా ఈ షోలో హైలెట్ ఏమిటంటే సిరి హ‌గ్ లు, ముద్దుల‌పై ఆమె త‌ల్లి తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

Also Read : స‌భ్యుల ఆరోగ్యంపై ఫోక‌స్ – విష్ణు

Leave A Reply

Your Email Id will not be published!