#FarmersFight : ఆందోళ‌న‌ విర‌మించం పోరాటం ఆపం

స్ప‌ష్టం చేసిన రైతు నేత తికాయ‌త్

Farmers Fight  : మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం సాగు చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గింది. ఈ మేర‌కు దేశ ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. జాతికి ఈ సంద‌ర్భంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అంతే కాకుండా కేబినెట్ కూడా ఆమోదించింది.

కానీ రైతులు మాత్రం త‌మ పోరాటాన్ని ఆప‌బోమంటున్నారు. ఇదే విష‌యాన్ని వారు ప్ర‌క‌టించారు. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు రైతులు పండించిన ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు చ‌ట్ట‌బ‌ద్ద‌త కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

త‌మ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, ఇందు కోసం ప్ర‌త్యేకంగా రైతు సంఘాల నేత‌లతో క‌మిటీని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు.

ఇప్ప‌టికే సంయుక్త కిసాన్ మోర్చా సార‌థ్యంలో రైతు నాయ‌కులు (Farmers Fight) ఆరు డిమాండ్ల‌తో కూడిన లేఖ‌ను ప్ర‌ధాన మంత్రి మోదీకి రాశారు.

కేవ‌లం త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌ధాని నాట‌కాలు ఆడుతున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.

ఇదే విష‌యమై బీకేయూ స్పోక్స్ ప‌ర్స‌న్ రాకేశ్ తికాయ‌త్ నిప్పులు చెరిగారు బీజేపీ స‌ర్కార్ పై.

అదానీ, అంబానీలు ఈ దేశాన్ని పాలిస్తున్నార‌ని, కేంద్రంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం కాద‌ని ఆరోపించారు.

అంతే మోదీ స‌ర్కార్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆయ‌న అభివ‌ర్ణించారు. గ‌తంలో గుజ‌రాత్ సీఎంగా మోదీ ఉన్న స‌మ‌యంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని ఆ

నాటి కాంగ్రెస్ స‌ర్కార్ పీఎం మ‌న్మోహ‌న్ సింగ్ కు లేఖ రాసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు రాకేష్ తికాయ‌త్.

నిర‌స‌న‌కారులు, ప్ర‌ధానంగా రైతులు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్ల ఉదాసీనంగా కాకుండా అప్రమ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

క‌లిసి ఉన్న రైతుల‌ను విడ‌గొట్టేందుకు మోదీ య‌త్నిస్తున్నారంటూ ఆరోపంచారు తికాయ‌త్.

ఏడాది కాలంగా ఎన్నో అవ‌మానాలు, క‌ష్టాలు ఎదుర్కొన్నాం. రైతుల‌పై పెట్టిన కేసుల‌ను ఎందుకు వెన‌క్కి తీసుకోవ‌డం లేదో చెప్పాలి.

చ‌ని పోయిన రైతులు 750 మందికి ప‌రిహారం ఇవ్వాలి. వారి కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగ భ‌ద్ర‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు రాకేశ్ తికాయ‌త్.

విత్త‌న కంపెనీల‌కు మోదీ వ‌త్తాసు ప‌లుకుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లును విర‌మించు కోవాల‌ని డిమాండ్ చేశారు తికాయ‌త్.

మొత్తంగా తికాయ‌త్ త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించేంత దాకా ఊరుకోబోమంటున్నారు.

Also Read : ఆట‌ లోనే కాదు వ్య‌క్తిత్వం లోనూ భేష్

Leave A Reply

Your Email Id will not be published!