#RakeshTikait : దేశం చూపు తికాయ‌త్ వైపు

రైతుల ఉద్యామానికి వెన్ను ద‌న్ను

Rakesh Tikait : దేశం ఒకే ఒక్క‌డి వైపు చూస్తోంది. రైతుల ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ లేదు. చివ‌ర‌కు కేంద్ర స‌ర్కారే దిగి వ‌చ్చింది.

సాగు చ‌ట్టాల‌ను ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తీసుకు వ‌చ్చింది.

ఇవి చ‌ట్టాలు కావ‌ని రైతుల పాలిట ఉరి తాళ్లు అంటూ పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు రైతులు.

కేంద్రం ఈ ఉద్య‌మాన్ని ప‌లుచ‌న చేయాల‌ని చూసింది. దేశ ద్రోహులుగా ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసింది.

త‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న కంగ‌నా, అక్ష‌య్ కుమార్, స‌చిన్ టెండూల్క‌ర్ లాంటి వాళ్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా రైతుల‌పై ఉసిగొల్పినా చివ‌ర‌కు వాళ్లు బెద‌ర‌లేదు.

స‌రిక‌దా అద‌ర లేదు కూడా. ఏ పార్టీల వ‌ద్ద‌కు వెళ్ల లేదు. ఎవ‌రినీ దేబరించ లేదు. అన్ని రాజ‌కీయ పార్టీలే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చేలా పోరాటం చేశారు రైతులు.

వీరంద‌రిని ఒకే తాటిపైకి తీసుకు రావ‌డంలో గ‌ణ‌నీయ‌మైన కృషి చేసిన రైతు నాయ‌కుల్లో అగ్ర‌భాగాన నిలిచింది మాత్రం ఒకే ఒక్క‌డు

అత‌డే భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait). ఏ పిలుపు ఇచ్చినా దానిని స‌క్సెస్ అయ్యేలా చేశాడు.

ఆయ‌నను కొన్ని మార్కెట్ శ‌క్తులు పెంచి పోషిస్తున్నాయ‌ని, అమెరికా లాంటి దేశాలు, ఎన్నారైలు,

వ్యాపార వేత్త‌లు లోపాయికారిగా మ‌నీ ప‌రంగా స‌పోర్ట్ చేస్తున్నారంటూ కేంద్రం తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

కేసులు న‌మోదు చేశారు. అక్ర‌మంగా అరెస్ట్ ల‌కు పాల్ప‌డ్డారు. భారీ ఎత్తున లాఠీఛార్జీలకు పాల్ప‌డ్డారు. పెద్ద ఎత్తున రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

రైతు సంఘం నేత‌లు దాదాపు 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని చెబుతున్నారు.

కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait). ఆయ‌న ప్ర‌ధానంగా మోదీ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు.

సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు రైతులు పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర – ఎంఎస్పీ పై కూడా చ‌ట్టం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అంత దాకా తాము ఇళ్ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తి లేదంటున్నారు. సుప్రీంకోర్టు కూడా రైతుల విష‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదే స‌మ‌యంలో రైతుల పోరాటానికి దిగి వ‌చ్చింది మోదీ స‌ర్కార్ .

బేష‌ర‌తుగా తాము తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు మోదీ. దీనిని తాము న‌మ్మ బోమంటున్నారు రాకేశ్ తికాయ‌త్.

ఇదంతా ఎన్నిక‌ల జిమ్మిక్కు త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈనెల 29న శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ట్రాక్ట‌ర్ల‌తో పార్ల‌మెంట్ వ‌ర‌కు మార్చ్ చేప‌డ‌తామ‌ని ప్ర‌కటించారు. ఇప్పుడు తికాయ‌త్ నేష‌న‌ల్ హీరో.

Also Read : తండ్రి వార‌స‌త్వం తికాయ‌త్ పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!