#KTR : ‘ఫార్మా హ‌బ్’ గా హైద‌రాబాద్ – కేటీఆర్

ఫ్లో కెమిస్ట్రీ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు

KTR  : ఫార్మా రంగానికి మ‌న హైద‌రాబాద్ కేరాఫ్ గా మారింద‌ని కొనియాడారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR ). బ‌హుళ‌, పారిశ్రామిక ఉప‌యోగాల కోసం ఫ్లో కెమిస్ట్రీ ఇన్నోవేష‌న్ అండ్ టెక్నాల‌జీ హ‌బ్ ను న‌గ‌రంలో ఏర్పాటు చేయ‌నున్నారు.

సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ గా ప‌ని చేయ‌నున్న ఈ హ‌బ్ భార‌త దేశంలో ఔష‌ధ రంగాన్ని మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు కేటీఆర్.

ఆధునిక విధానాల ద్వారా ప‌రిశోధ‌న‌, అభివృద్ధి నుంచి త‌యారీ దాకా ఇది దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హానీ అంటూ ఉండ‌ద‌ని పేర్కొన్నారు.

ఈ హ‌బ్ ను డాక్ట‌ర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఏర్పాటు చేయ‌నుండ‌గా రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ తో పాటు లార‌స్ ల్యాబ్స్ నిధులు స‌మ‌కూర్చ‌నున్నాయి.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శాస్త్ర‌జ్ఞులు, అంత‌ర్జాతీయ స‌ల‌హాదారు ప్రొఫెస‌ర్ గోవ‌ర్ద‌న్ మెహ‌తా , కేంబ్రిడ్జ్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ స్టీవెన్ లే, ఆస్ట్రియా లోని గ్రాజ్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ ఆలివ‌ర్ క‌ప్పే, టోక్యో యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ షు కొబ‌యాషీ శాస్త్రీయ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించ‌నున్నారు.

తెలంగాణ స‌ర్కార్ స‌హ‌కారం అందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్(KTR )వెల్ల‌డించారు. ఈ కేంద్రం ఔష‌ధ రంగం అభివృద్ధికి దోహ‌ద ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ కేంద్రం ఏర్పాటు ప‌ట్ల డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ , లార‌స్ ల్యాబ్స్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు కేటీఆర్.

లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి తో పాటు ఈ రంగంలో త‌మ నాయ‌క‌త్వ స్థానాన్ని నిలుపుకునేందుకు క‌ట్ట‌బడి ఉన్న‌ట్లు ఐటీ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ పేర్కొన్నారు.

Also Read : పేద‌ల‌కు వ‌రం ఉచిత రేష‌న్ ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!