#RakeshTikait : తికాయ‌త్ కామెంట్స్ గులాబీలో క‌ల‌క‌లం

టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి పార్టీ

Rakesh Tikait  : కిసాన్ సంయుక్త మోర్చా అగ్ర నేత‌, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్ర‌తినిధి రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait )సంచ‌ల‌న కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో క‌ల‌క‌లం రేపాయి.

సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త ఏడాది కాలంగా ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద మ‌హా ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌రై ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.

హైద‌రాబాద్ కాకుండా ఢిల్లీకి ఆ పార్టీని పంపించకండి అంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు.

అంతే కాదు ఆ పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి బి టీమ్ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

సీఎం కేసీఆర్ ను తాము న‌మ్మ‌లేమ‌ని, ఆయ‌న పూర్తిగా మోదీకి నమ్మిన బంటు అంటూ మండిప‌డ్డారు.

అటు ఆంధ్ర ప్ర‌దేశ్ , ఇటు తెలంగాణ రెండూ బీజేపీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు చేస్తున్నారంటూ ఆరోపించారు తికాయ‌త్.

కేసులు న‌మోదు చేసినా, అరెస్ట్ ల పాలు చేసినా, వాహ‌నాల‌తో తొక్కి చంపించినా తాము త‌ట్టుకుని నిల‌బడ్డామ‌ని పేర్కొన్నారు.

సాగు చ‌ట్టాల‌తో పాటు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర – ఎంఎస్పీ చ‌ట్టాన్ని కూడా చేయాల‌ని తికాయ‌త్ (Rakesh Tikait ) డిమాండ్ చేశారు.

మోదీ మాట‌ల‌ను న‌మ్మ‌లేమ‌న్నారు. ప‌రోక్షంగా ఎంఐఎం ఓవైసీని కూడా విమ‌ర్శించారు. ఈ త‌రుణంలో ఆయ‌న చేసిన కీల‌క వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఏడాది ఉద్య‌మంలో ఇన్ని ఇబ్బందుల‌కు లోనైనా ఈ రోజు వ‌ర‌కు మోదీ స్పందించలేద‌ని, ఉన్న‌ట్టుండి సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటామంటే ఎలా న‌మ్ముతామ‌ని ప్ర‌శ్నించారు.

సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో 6 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప్ర‌ధానికి లేఖ రాశామ‌న్నారు. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ పార్ల‌మెంట్ లో చ‌ట్టం తీసుకు రావాల‌ని, అదే స‌మ‌యంలో ఎంఎస్పీ పై చ‌ట్టం రూపొందించాల‌ని, రైతు సంఘాల నేత‌ల‌తో క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని రాకేశ్ తికాయ‌త్ డిమాండ్ చేశారు.

మొత్తంగా చ‌ని పోయిన రైతుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ ను నిల‌దీశారు. ముందు తెలంగాణ రాష్ట్రంలో మ‌ర‌ణించిన రైతులకు ప‌రిహారం ఇచ్చారా అని ప్ర‌శ్నించారు.

మొత్తంగా రాకేశ్ తికాయ‌త్ చేసిన కామెంట్స్ ఇప్పుడు గులాబీ ద‌ళంలో క‌ల‌క‌లం రేపాయి. ఏది ఏమైనా ఈ రైతు నేత రూటే స‌ప‌రేట్.

Also Read : తండ్రి వార‌స‌త్వం తికాయ‌త్ పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!