#ShreyasIyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డ్ సెంచ‌రీ

ఆరంభ మ్యాచ్ లో అరుదైన ఘ‌న‌త

ShreyasIyer  : స్వ‌దేశంలో కీవీస్ తో కాన్పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్ లో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. క్రికెట్ కెరీర‌లో తొలి టెస్టు ఆడుతున్న శ్రేయ‌స్ అయ్య‌ర్(ShreyasIyer )సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

ఇవాళ రెండో రోజు. అరంగేట్ర టెస్టులో శ‌త‌కం సాధించిన 16వ భార‌తీయ బ్యాట‌ర్ గా శ్రేయ‌స్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివ‌రిసారిగా ఈ ఘ‌న‌త‌ను అందుకున్న బ్యాట‌ర్ లిస్టులో పృట్వీ షా ఉన్నాడు.

2018లో రాజ్ కోట్ లో జ‌రిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఇక తొలి టెస్టు లోనే సెంచ‌రీ చేసిన తొలి ఇండియ‌న్ క్రికెట‌ర్ గా లాలా అమ‌ర్ నాథ్ ఉన్నాడు. 1933లో ఆ రికార్డు సాధించాడు.

ఇక ఆడిన తొలి టెస్టు మ్యాచ్ లోనే శ‌త‌కాలు సాధించిన వారిలో సోధ‌న‌, క్రిపాల్ సింగ్ , అబ్బాస్ అలీ బేగ్ , హ‌నుమంత్ సింగ్ , గుండ‌ప్ప విశ్వ‌నాథ్ , సురింద‌ర్ అమ‌ర్ నాథ్ , మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , ప్ర‌వీన్ ఆమ్రే, సౌర‌వ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ , సురేశ్ రైనా, శిఖ‌ర్ ధావ‌న్, రోహిత్ శ‌ర్మ ఉన్నారు.

అంత‌కు ముందు తొలి టెస్టు ఆడ‌తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ కు భార‌తీయ క్రికెట్ దిగ్గ‌జం సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్టు క్యాప్ ను అందిచాడు. ఇదిలా ఉండ‌గా కాన్పూర్ వేదిక‌పై మొద‌టి మ్యాచ్ లోనే శ‌త‌కం సాధించిన రెండో ప్లేయ‌ర్ గా అయ్య‌ర్ నిలిచాడు.

గ‌తంలో ఇదే పిచ్ పై దిగ్గ‌జ ప్లేయ‌ర్ గుండ‌ప్ప విశ్వ‌నాథ్ ఆ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక అయ్య‌ర్ సెంచ‌రీ విష‌యానికి వ‌స్తే 13 ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో 105 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

Also Read : భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!