#SumathiDig : పిల్ల‌ల ధైర్యానికి ‘డీఐజీ సుమ‌తి’ ఫిదా

హ‌న్మంతు ధైర్యం అభినంద‌నీయం

Sumathi Dig : తెలుగు రాష్ట్రాల‌నే కాదు సోష‌ల్ మీడియాను షేక్ చేశారు ఆ పిల్ల‌లు. కానీ వారు చేసింది కొంద‌రికి న‌వ్వును తెప్పిస్తే మ‌రికొంద‌రికి మాత్రం చిన్న వ‌య‌సులోనే సామాజిక బాధ్య‌త‌ను గుర్తుంచు కోవ‌డాన్ని మెస్మ‌రైజ్ చేసేలా చేసింది.

ఆ పిల్ల‌లు ఎవ‌రో కాదు ఏపీలోని క‌ర్నూలు జిల్లా పెద క‌డుమూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోకి చెందిన వారు. ప‌ట్టు మ‌ని ఏడేళ్లు కూడా ఉండ‌ని ఆ చిన్నారులు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

నెట్టింట్లో వైర‌ల్ గా మారారు. తెలుగు ప్రసార మాధ్య‌మాలు ఆ పిల్ల‌లు చేసిన ధైర్య సాహ‌సాన్ని చూసి విస్తు పోయారు. త‌న పెన్సిల్ పోయిందంటూ హ‌న్మంతు అనే చిన్నారి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాడు.

త‌న పెన్సిల్ తో పాటు పుస్త‌కాలు కూడా దొంగిలిస్తున్నాడ‌ని తోటి పిల్లోడి గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం పోలీసుల‌న్నా, పోలీస్ స్టేష‌న్ ల‌న్నా విప‌రీత‌మైన భ‌యం. పెద్ద వాళ్లు సైతం వెళ్లేందుకు భ‌య‌ప‌డ‌తారు.

గ‌తంలో నైనా ఇప్పుడైనా ఎందుకు వెళ్ల‌డం అనే దుర‌భిప్రాయం నెల‌కొంది. కానీ చూస్తే పిల్లలు నేరుగా ఠాణాకు వెళ్లారు. సార్ నాకు తెలియ‌కుండా పెన్సిల్, పుస్త‌కాలు తీసుకుంటున్నాడు సార్.

కేసు న‌మోదు చేయండి సార్ అంటూ హ‌న్మంతు అన్న మాట‌లు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వేలాది మందిని ఆక‌ట్టుకునేలా చేశాయి. మొత్తంగా ఆ పిల్ల‌ల‌కు స‌ర్ది చెప్పి రాజీ కుద‌ర్చి పంపించారు పోలీసులు.

సో..పెద‌క‌డుమూరుకు చెందిన ఆ పిల్ల‌ల ధైర్యం , పోలీసుల ప‌ట్ల ఉన్న గౌర‌వాన్ని మ‌రింత ఇనుమ‌డించేలా చేసింద‌ని వుమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ డీఐజీ సుమ‌తి(Sumathi Dig) కొనియాడారు. వారికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ చేశారు.

Also Read : మొగుల‌య్య గానం ఆర్టీసీ బ‌హుమానం

Leave A Reply

Your Email Id will not be published!