Poola Anthony : వాటిక‌న్ లో కార్డిన‌ల్ గా హైద‌రాబాద్ బిష‌ప్

ఆర్చ్ బిష‌ప్ పూలా ఆంథోనీ రికార్డ్

Poola Anthony : హైద‌రాబాద్ ఆర్చ్ బిష‌ప్ పోప్ ఫ్రాన్సిస్ చేత వాటిక‌న్ కార్డిన‌ల్ గా నియమితుల‌య్యారు. వాటిక‌న్ సిటీ లోని సెయింట్ పీట‌ర్స్ బ‌సిలికాలో పోప్ ఫ్రాన్సిస్ అధ్య‌క్ష‌త‌న కార్య‌క్ర‌మంలో పూలా ఆంథోనీ కార్డిన‌ల్ గా (Poola Anthony) నియ‌మితుల‌య్యారు.

పూలా ఆంథ‌క్ష‌నీ న‌వంబ‌ర్ 2020లో హైద‌రాబాద్ ఆర్చ్ బిషంప్ గా నియ‌మితుల‌య్యారు. ఇదిలా ఉండ‌గా కార్డిన‌ల్ గా నియ‌మితులైన తొలి తెలుగు వ్య‌క్తిగా హైద‌రాబాద్ ఆర్చ్ బిష‌ప్ పూలా ఆంథోనీ నిలిచారు.

బ‌సిలికాలో జ‌రిగిన ఈ వేడుక‌కు పోప్ ఫ్రాన్సిస్ అధ్య‌క్ష‌త వ‌హించారు. హైద‌రాబాద్ ఆర్చ్ బిష‌ప్ రోమ‌న్ పోంటీస్ కాలేజ్ ఆఫ్ కార్డిన‌ల్స్ లో ఒక‌రిని వివిధ విష‌యాల‌లో మార్గ నిర్దేశం చేస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు , భార‌త దేశానికి ఒక చారిత్రాత్మ‌క క్ష‌ణం అని పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఇది నిజంగా మ‌నంద‌రికీ గ‌ర్వ కార‌ణం.

హైద‌రాబాద్ నుండి బిష‌ప్ లు, పూజారులు, ఆర్చ్ బిష‌ప్ బంధువులు , విశ్వాసుల‌తో కూడిన ప్ర‌తినిధి బృందం ఈ వేడుక‌ను చూసేందుకు రోమ్ కు వెళ్లింది.

ఆంధ్రప్ర‌దేశ్ లోని క‌ర్నూలు జిల్లాకు చెందిన 60 ఏళ్ల ఆంథోనీని మేలో పోప్ ఫ్రాన్సిస్ కార్డిన‌ల్స్ లో ఒక‌రిగా ఎలివేట్ చేశారు. 1992 ఫిబ్ర‌వ‌రిలో పూజారిగా నియ‌మితుల‌య్యారు.

2008లో ఫిబ్ర‌వ‌రిలో క‌ర్నూలు బిష‌ప్ గా నియ‌మింప‌బ‌డ్డారు. న‌వంబ‌ర్ 2020లో హైద‌రాబాద్ ఆర్చ్ బిష‌ప్ గా ఉన్నారు. భార‌త దేశానికి చెందిన ఇత‌ర కార్డిన‌ల్స్ గోవా ఆర్చ్ బిష‌ప్, డామ‌న్ ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టావో డి రోసారియో ఫెర్రావో ఉన్నారు.

Also Read : పోష‌కాహార లోపంపై యుద్దం చేయాలి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!