AAP Trust Vote : బ‌ల నిరూప‌ణ‌కు అర‌వింద్ కేజ్రీవాల్ రెడీ

సోమ‌వారం తేల‌నున్న ఆప్ భ‌విత‌వ్యం

AAP Trust Vote : కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ ఆప్ స‌ర్కార్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది.

ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ఆప్ ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున, చేర్పిస్తే రూ. 25 కోట్లు ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్ చేసిందంటూ ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దీంతో త‌మ ప్ర‌భుత్వానికి బ‌లం ఏమిటో నిరూపించు కునేందుకు సిద్ద‌మ‌య్యారు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఈ మేర‌కు ఇప్ప‌టికే త‌న నివాసంలో కీల‌క భేటీ నిర్వ‌హించారు.

మొత్తం ఎమ్మెల్యేల‌కు గాను 12 మంది శాస‌న‌స‌భ్యులు డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీ పాచిక‌లు పారుతున్నాయ‌నే దిశ‌గా సంకేతాలు వెలువ‌డ్డాయి. స‌ర్కార్ కూల‌నుందంటూ జోరుగా ప్ర‌చారం కూడా జ‌రిగింది.

ఈ త‌రుణంలో త‌మ‌కు ఉన్న అస‌లైన బ‌లం ఏమిటో ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా నిరూపించు కునేందుకు సిద్ద‌మ‌య్యారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇందుకు ఆగ‌స్టు 29 సోమ‌వారం ముహూర్తం నిర్ణ‌యించారు.

ఇవాళ త‌న మెజారిటీని నిరూపించు కుంటాన‌ని(AAPS Trust Vote) శ‌ప‌థం చేశారు. తాము అవినీతి, అక్ర‌మాల‌ను ప్రోత్స‌హించ‌మ‌ని , త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ అమ్ముడ పోర‌ని ప్ర‌త్యేకించి ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌ల వంచ‌బోరంటూ ప్ర‌క‌టించారు ఆప్ చీఫ్‌.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 62 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు కావ‌డం విశేషం.

కాగా త‌న ఇంట్లో జ‌రిగిన భేటీకి 53 మంది ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. బీజేపీ చేసిన ప్ర‌లోభాల‌కు త‌ల వంచ‌ని ఎమ్మెల్యేల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : అకాసా ఎయిర్ మెగా డేటా ఉల్లంఘ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!