Ghulam Nabi Azad : రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదు
గులాం నబీ ఆజాద్ సంచలన కామెంట్స్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ కురువృద్దుడు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పార్టీ సర్వ నాశనం కావడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అంటూ మండిపడ్డారు.
అయితే పనిలో పనిగా తన రాజీనామా లేఖలో సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ తరుణంలో సోమవారం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
రాహుల్ గాంధీ మంచి మనిషి అని కానీ ఆయనకు రాజకీయాలు తెలియదని పేర్కొన్నారు ఆజాద్. గత వారం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అనేది అర్థ రహితమని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీడబ్ల్యూసీ అర్థం లేనిదని, అది ఉన్నా లేనట్టేనని ఫైర్ అయ్యారు ఆజాద్.
గత 10 సంవత్సరాలలో 25 సీడబ్ల్యూసీ సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారని కానీ పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు గులాం నబీ ఆజాద్.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు చాలా వరకు సంప్రదింపుల రాజకీయాలను నమ్ముతారని కేంద్ర మాజీ మంత్రి స్పష్టం చేశారు. కానీ రాహుల్ గాంధీ హయాంలో అది పూర్తిగా నాశనం అయ్యిందని మరోసారి ధ్వజమెత్తారు.
1998, 2004 మధ్య పూర్తిగా సీనియర్ నాయకులతో సంప్రదింపులు కొనసాగుతూ వచ్చాయి. సోనియా గాంధీ వారిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నారు. చేసిన సిఫార్సులను ఆమోదించారు.
ఆమె నాకు ఎనిమిది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. నేను ఏడు గెలిచానని చెప్పారు ఆజాద్. రాహుల్ గాంధీ(Rahul Gandhi) వచ్చాక 2004లో ఆమె తనయుడిపై ఆధారపడ్డారు. పార్టీ కొంప ముంచిందన్నారు.
Also Read : మఠాధిపతి లైంగిక కేసులో నో కామెంట్