Kiren Rijiju : ఈశాన్య భారతంలో ప్రతి ఊరికి 4జీ సేవలు
2023 నాటికి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Kiren Rijiju : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈశాన్య భారత దేశంలోని ప్రతి ఊరికి 4జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని పేర్కొంది. దీనిని వచ్చే ఏడాది డిసెంబర్ వరకల్లా పూర్తవుతుందని స్పష్టం చేసింది. అన్ని జనావాస గ్రామాలకు 4జీ మొబైల్ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇందుకు సంబంధించి జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో టెలికాం విప్లవం కొనసాగుతోందన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలో ఏ ఒక్క ఊరు టెలికాంతో అనుసంధానం లేదన్న వార్త ఉండకూడదన్నారు.
ఇదే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదమని చెప్పారు. ఈశాన్య భారతంలోని ప్రతి ఊరుతో పాటు సరిహద్దు గ్రామాల్లో కూడా 4జీ కనెక్టివిటీ కలిగి ఉండాలని తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం కిరెన్ రిజిజు కేంద్ర మీడియా పీటీఐతో మాట్లాడారు.
వివిధ వాటాదారుల మధ్య సమన్వయాన్ని నిర్ధారించడం, వారందరినీ ఆన్ బోర్డ్ లోకి తీసుకు రావడం , ఏదైనా ఏర్పడిన ఖాళీని పూరించడం తమ ముందున్న ప్రధాన కార్యక్రమమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
ఈ సమీక్షా సమావేశానికి టెలికాం సెక్రటరీ, టెలికాం, సాయుధ దళాలతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. పీఎం కోరుకున్న విధంగా సకాలంలో పని చేస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి రిజిజు తన స్వంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
Also Read : కేరళ గవర్నర్ పై జర్నలిస్టుల కన్నెర్ర