Salhoutuono Kruse : తొలి మహిళా మంత్రిగా క్రూసే రికార్డ్
చరిత్ర సృష్టించిన సల్హౌటునో క్రూసే
Salhoutuono Kruse : నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మహిళలు ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. కానీ 2023 ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇద్దరు మాత్రం చరిత్ర తిరగరాశారు. తమకు ఎదురే లేదని చాటారు. ఇక్కడ బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సీఎంగా నీఫియు రియో వరుసగా 5వ సారి నాగాలాండ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారు.
ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా తో పాటు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు. ఇక నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి దాకా ఏ ఒక్కరు కూడా మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందలేదు. ఈ సారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇద్దరు విజయం సాధించారు.
వారిలో సల్హౌతునో క్రూసే కాగా మరొకరు హైకానీ జఖాలు ఉన్నారు. వారిలో సల్హౌతునో క్రూసే(Salhoutuono Kruse) అరుదైన ఘనత సాధించారు. ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఇవాళ జరిగిన కేబినెట్ లో మొదటి మహిళా మంత్రిగా అవతరించారు. సీఎం రియో తో పాటు 9 మంది మంత్రులతో కలిసి కొహిమాలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
Also Read : రియో ఐదోసారి సీఎంగా ప్రమాణం