Rashi Gupta Rezo AI : ఈ డేటా సైంటిస్ట్ వెరీ స్పెషల్
డాక్టర్ రాశి గుప్తా మోస్ట్ పాపులర్
Rashi Gupta Rezo AI : ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. దీనినే ఆధారంగా చేసుకున్న స్టార్టప్ లు కూడా వెల్లువలా వస్తున్నాయి. కానీ భారత దేశానికి చెందిన ఓ మహిళా డేటా సైంటిస్ట్ ఏకంగా పర్యావరణ వ్యాపార వ్యవస్థను మార్చేసే స్థాయికి చేరుకున్నారు.
ఆమె ఎవరో కాదు డాక్టర్ రాశి గుప్తా(Rashi Gupta). ఈ మహిళా వ్యాపారవేత్త వెరీ స్పెషల్. మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్ గా కూడా గుర్తింపు పొందారు. ఇంతకూ ఆమె చేసిన ప్రయోగం ఏమిటి. దాని వెనుక కథేంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇప్పటి వరకు చీఫ్ డేటా సైంటిస్ట్ గా ఉన్నారు. ఆమె రెజో. ఏఐని స్థాపించారు. ఏఐ అనేది ఆధారిత కాంటాక్ట్ సెంటర్. ఆమె జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం , డబ్ల్యూఎన్ఎస్ తో కలిసి పని చేశారు.
ఇందులో 20 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉంది. హెల్సింకి విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. అంతే కాదు ఐఐటీ ఢిల్లీ నుండి డబుల్ మాస్టర్స్ పొందడం విశేషం. ప్రతి ఏటా వ్యాపారాలు తమ పోటీదారులు, మార్కెట్ లో కొత్తగా ప్రవేశించిన వారి కారణంగా వేలాది మంది కస్టమర్లను కోల్పోతాయి.
దీనికి ప్రధానంగా రెండు కారణాలను గుర్తించారు రాశి గుప్తా(Rashi Gupta Rezo AI ). పేలవమైన కస్టమర్ అనుభవం, రెండు కంపెనీ ద్వారా అసమర్థమైన కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్. ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది రాశి గుప్తా స్థాపించిన రెజో.ఏఐ. తన భర్త మనీష్ గుప్తాతో కలిసి ఏఐతో కస్టమర్ ఇంటరాక్షన్ లకు శక్తిని కలిగించేందుకు ఇది తోడ్పడుతోంది.
Also Read : కలలకు సాకారం సక్సెస్ కు సోపానం