Prerna Jhunjhunwala : ‘ప్రేర‌ణ’ లెర్నింగ్ యాప్ ప‌వ‌ర్ ఫుల్

క్రియేటివ్ గెలీలియో..లిటిల్ సింగం

Prerna Jhunjhunwala : దేశంలో స్టార్ట‌ప్ ల‌కు కొద‌వే లేదు. భిన్నంగా ఆలోచించ‌డం స‌మాజానికి మేలు చేకూర్చేలా ఉండ‌టం. ఆపై ప‌ది మందికి ఉపాధి క‌ల్పించేలా చేయ‌డం. ప్రేర‌ణ ఝున్ ఝున్ వాలా మోస్ట్ పాపుల‌ర్ ఎంట్ర‌ప్రెన్యూర్ గా గుర్తింపు పొందారు. ఆమె క్రియేటివ్ ఎలీలియో – లిటిల్ సింగం , కిడ్స్ ఎర్లీ లెర్నింగ్ యాప్ ఫౌండ‌ర్ గా ఉన్నారు.

పిల్ల‌ల‌కు అర్థం అయ్యేలా, వినూత్నంగా బోధ‌న‌ను అందించేందుకు ప్లాన్ చేసింది. నిర్మాణాత్మ‌క‌మైన విద్య‌ను అందించేలా చేయ‌డం. ఉన్న‌త స్థాయికి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంపై ఫోక‌స్ పెట్టింది ప్రేర‌ణ ఝున్ ఝున్ వాలా(Prerna Jhunjhunwala).

పిల్ల‌ల‌కు సంబంధించి వివిధ స‌బ్జెక్టుల‌లోని గ్రేడ్ ల‌పై కాకుండా వారి నాయ‌క‌త్వ నైపుణ్యాలు, త‌ప్పు ప‌ట్ట‌లేని సామాజిక అంశాల‌పై కూడా ఆధార‌పడి ఉంటుంద‌ని ప్రేర‌ణ న‌మ్ముతుంది. ఆమె అమెరికా లోని న్యూయార్క్ యూనివ‌ర్శిటీలో స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి సైన్స్ లో బ్యాచిల‌ర్ డిగ్రీని పొందారు. 

ఇదే ఆమెను విద్య ప‌ట్ల ఉత్సుక‌త‌, ప్రేమ క‌లిగించేలా చేసింది. విద్యా రంగంలో ప్రేర‌ణ‌కు 10 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉండ‌డం అద‌న‌పు బ‌లంగా మారింది. ఇదే యాప్ త‌యారు చేసేలా చేఇసంది. క్రియేటివ్ గెలీలియో, లిటిల్ సింఘం ఎర్లీ లెర్నింగ్ యాప్ ప్ర‌త్యేకంగా ఎడ్ టెక్ ఎకో సిస్ట‌మ్ లో ఉంచారు. జూలై 2020న ప్రారంభించారు. 6 మిలియ‌న్ల‌కు పైగా డౌన్ లోడ్ చేసుకోవ‌డం ఓ రికార్డ్.

Also Read :  డిజైనింగ్ లో శృతి జైపురియా శ‌భాష్

Leave A Reply

Your Email Id will not be published!