Misbah Kapadia : సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్
మిస్బా కపాడియా డిజైనర్
Misbah Kapadia : జీవితంలో సవాళ్లు ఎదురైతేనే సక్సెస్ సాధ్యం అవుతుందని అంటారు మిస్బా కపాడియా(Misbah Kapadia). భారత దేశంలో అత్యున్నతమైన డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇంటీరియర్ డిజైనర్ గా పేరొందారు. డిజైన్ కన్ స్ట్రక్ట్ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. క్యూరేటర్ గా కూడా పనితనాన్ని కలిగి ఉన్నారు. డిజైన్ పరిశ్రమలో మిస్బా కీలకంగా మారారు. ఒక దశాబ్దానికి పైగా పని చేశారు. ఆతిథ్యం, నివాస స్థలాల రూపకల్పనలో మిస్బా కపాడియాకు గణనీయమైన అనుభవం కలిగి ఉన్నారు.
బాంద్రా, లోఖండ్ వాలా లోని స్విలర్ బీచ్ కేఫ్ , ఫేసింగ్ ఈస్ట్ , మదీరా , మైమ్ బౌగెన్ విల్లా, ఓహ్ పిటారా, పూణే లోని హపా ఏషియన్ స్టిర్ , నాసిక్ లోని లిక్కర్ ఎంబసీ , 1 బీహెచ్ కే బెంగళూరు శివ్ వంటి కొన్ని ప్రసిద్ధ రెస్టారెంట్ ల కోసం డిజైన్లను రూపొందించారు. ఈ మొత్తం డిజైన్ల వెనుక మిస్బా కపాడియా(Misbah Kapadia) మనసు కలిగి ఉన్నారు. ఆమె గృహాలు , రిటైల్ అనుభవాలను కూడా రూపొందించారు.
వీటిలో పేరొందిన ఆర్టిస్ట్ దీప్తి సాధ్వాని కోసం అందమైన ఇల్లు తీర్చిదిద్దిన ఘనత మిస్బా కపాడియా. రహేజా ఇంపీరియా వర్లీలో 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కూడా ఆమె చేతిలో రూపు దిద్దుకున్నదే కావడం విశేషం.
ఇంటరీయర్ డిజైనర్ గా 15 ఏళ్ల పాటు పని చేశారు. సవాళ్లతో కూడిన టాస్క్ లను సమర్థవంతంగా నిర్వహించారు. గుర్తింపు, విజయం కలిపి స్వంత సంస్థను ప్రారంభించేలా చేసింది మిస్బా కపాడియా. 22 ఏళ్ల వయసులో మిన్నీ భట్ డిజైన్స్ లో అంతర్భాగంగా ఉన్నారు. డిజైన్ లీడ్ గా ఎన్నో ప్రాజెక్టులకు డిజైన్ చేశారు. డిజైన్ కన్ స్ట్రక్ట్ ఫౌండర్ గా , క్యూరేటర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
Also Read : ఆగ్రో టెక్నాలజీలో పల్లవి సింగ్ అదుర్స్