Arvind Kejriwal : కొత్త ఫ్రంట్ లో కేజ్రీవాల్ ఉంటారా
ఏడుగురు సీఎంలకు సీఎం లేఖ
Arvind Kejriwal Third Front : పలువురు సీఎంలకు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖలు రాసినట్లు సమాచారం. వారిలో ఏడుగురు సీఎంలు ఉన్నట్లు టాక్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళకు చెందిన పినరయ్ విజయన్ , తమిళనాడుకు చెందిన సీఎం ఎంకే స్టాలన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ , తదితరులు ఉన్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్ లో కొలువు తీరింది. రాను రాను తమ ఓటు బ్యాంకును ఆప్ చీల్చుతోందని అనుమానం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్(Arvind Kejriwal Third Front) వైపు వెళ్లాలనే తాజా ప్రయత్నం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. ఈసారి ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర సీఎంల ఫోరమ్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయా సీఎంలను ఢిల్లీకి ఆహ్వానించారు సీఎం.
కేంద్రంతో పోరాడుతున్న ప్రగతిశీల ముఖ్యమంత్రుల బృందంను ఏర్పాటు చేయండి అని సూచించారు. ఫిబ్రవరి 5న ఈ లేఖను సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్ , ఎంకే స్టాలిన్ , హేమంత్ సోరేన్ లకు రాశారు. కాగా ఆరోగ్యం బాగా లేదని తాను రాలేనంటూ హాజరు కాలేక పోయారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల తారక రామారావు. కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎంలో కేజ్రీవాల్(Arvind Kejriwal) తో పాటు భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
Also Read : రాహుల్ కు ఒమర్ అబ్దుల్లా మద్దతు