Suyash Sharma : మ‌న‌సు దోచుకున్న సుయాశ్ శ‌ర్మ‌

బెంగ‌ళూరుకు చుక్క‌లు చూపించిన స్పిన్న‌ర్

Suyash Sharma : 16వ సీజ‌న్ ఐపీఎల్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన ఆట‌గాళ్ల‌లో కొంద‌రు తేలిపోతే మ‌రికొంద‌రు అంతంత మాత్రంగా ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. మ‌రో వైపు త‌క్కువ ధ‌రకే అమ్ముడు పోయిన ఆట‌గాళ్లు మాత్రం దుమ్ము రేపుతున్నారు.

తాజాగా కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో సుయాశ్ శర్మ(Suyash Sharma) సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచాడు. అద్భుత‌మైన బంతుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 204 ప‌రుగులు చేసింది.

అనంత‌రం 205 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 81 ప‌రుగుల తేడాతో ఓటమి పాలైంది. కోల్ క‌తా స్పిన్న‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ స‌రైన్ , సుయాశ్ శ‌ర్మ‌ల దెబ్బ‌కు బెంగ‌ళూరు బ్యాట‌ర్లు విల విల లాడారు. ఒకానొక ద‌శ‌లో డిఫెన్స్ ఆడేందుకు య‌త్నించారు.

ఐపీఎల్ లో మొద‌టిసారిగా సుయాశ్ శ‌ర్మ(Suyash Sharma) చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. 30 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు. కోల్ క‌తా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆర్సీబీ బ్యాటింగ్ లైన‌ప్ వెన్నెముక‌ను విరిచాడు. విచిత్రం ఏమిటంటే సుయాశ్ శ‌ర్మ వ‌య‌స్సు కేవ‌లం 19 ఏళ్లే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జ‌రిగిన మినీ వేలంలో ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడిని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కేవ‌లం రూ. 20 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది.

Also Read : మెరిసిన శార్దూల్ మురిసిన కోల్ క‌తా

Leave A Reply

Your Email Id will not be published!