CSK vs MI IPL 2023 : ముంబైకి షాక్ చెన్నై ఝలక్
రెచ్చి పోయిన అజింక్యా రహానే
CSK vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన 11వ లీగ్ మ్యాచ్ లో జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. లీగ్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన లీగ్ మ్యాచ్ లలో కోల్ కతా నైట్ రైడర్స్ ను తాజాగా ముంబైలో ముంబై ఇండియన్స్ ను ఓడించి షాక్ ఇచ్చింది చెన్నై.
కేవలం సంప్రదాయక ఆటకు మాత్రమే పరిమితమైన మాజీ భారత జట్టు కెప్టెన్ అజింక్యా రహానే ఈసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐపీఎల్ టోర్నీలో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. లీగ్ లో రహానేకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. వాంఖడే స్టేడియంలో కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు . దీంతో ముంబైపై చెన్నై 7 వికెట్ల(CSK vs MI IPL 2023) తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది. రోహిత్ 21 రన్స్ చేస్తే ఇషాన్ కిషాన్ ఆశించినంత రాణించ లేక పోయాడు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 22 పరుగులు చేస్తే టిమ్ డేవిడ్ 31 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు.
మిగతా బ్యాటర్లు ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. ఇక చెన్నై తరపున జడ్డూ 3 వికెట్లు తీస్తే శాంట్నర్ , దేశ్ పాండే చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిసండా మగల ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు.
అనతరం బరిలోకి దిగిన చెన్నై డేవిడ్ కాన్వా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన అజింక్యా రహానే ఎక్కడా తగ్గలేదు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి పరుగుల వరద పారించాడు. 61 రన్స్ చేశాడు. 20 బంతుల్లో 50 రన్స్ చేశాడు.
Also Read : తలవంచిన ఢిల్లీ రాజస్థాన్ విక్టరీ