Australian PM : ప్ర‌ధాని మోదీయే బాస్ – అల్బ‌నీస్

ఆస్ట్రేలియా ప్ర‌ధాని కామెంట్స్

Australian PM : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు ఆస్ట్రేలియా ప్ర‌ధాని(Australian PM) ఆంటోనీ ఆల్బ‌నీస్. మంగ‌ళ‌వారం ప్ర‌వాస భార‌తీయుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఆపై ప్ర‌ధాని మోదీయే బాస్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం అల్బ‌నీస్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మోదీ అత్యంత చ‌రిష్మా క‌లిగిన నాయ‌కుడ‌ని పేర్కొన్నారు. ఇవాళ పీఎం మోడీకి ల‌భించిన స్వాగ‌తం దిగ్గ‌జ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్ స్టీన్ కు కూడా ల‌భించ లేద‌ని చెప్పారు అల్బ‌నీస్.

రియ‌ల్లీ మోదీ గ్రేట్ బాస్ అంటూ కొనియాడారు. మోదీని రాక్ స్టార్ తో పోల్చారు. నేను ఈ వేదిక‌పై చివ‌రిసారిగా బ్రూస్ ను చూశాను. ఇవాళ మోదీని చూస్తున్నాన‌ని చెప్పారు. వేద పండితుల మంత్రోశ్చార‌ణ‌ల‌తో పాటు ఇత‌ర సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. భార‌త దేశంలో తన ప‌ర్య‌ట‌న గురించి మ‌రోసారి గుర్తు చేసుకున్నారు అల్బ‌నీస్.

తాను వెళ్లిన ప్ర‌తి చోటా రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య లోతైన అనుబంధాన్ని అనుభ‌వించాన‌ని చెప్పారు. భార‌త్ ను అర్థం చేసుకోవాలంటే రైలు, బ‌స్సుల‌లో ప్ర‌యాణం చేయాల‌ని సూచించారు ప్ర‌ధాని. మార్చిలో నేను ప‌ర్య‌టించిన స‌మ‌యంలో గుజ‌రాత్ లో హోలీని జ‌రుపుకోవ‌డం, ఢిల్లీలో గాంధీకి పుష్ప గుచ్చం వేయ‌డం మ‌రిచి పోలేన‌న్నారు అల్బ‌నీస్.

Also Read : Akunuri Murali

Leave A Reply

Your Email Id will not be published!