YS Sharmila KCR : కేసీఆర్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే – ష‌ర్మిల‌

నిప్పులు చెరిగిన వైఎస్సార్ తెలంగాణ పీర్టీ చీఫ్

YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్(KCR) పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. శ‌నివారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన సీఎం ప్ర‌సంగంలో ఒక్క‌టి నిజం లేద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేనంటూ పేర్కొన్నారు.

ఈ తొమ్మిదేళ్ల పాల‌న‌లో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మ‌హ‌త్య‌లు, క‌మీష‌న్లు మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు వైఎస్ ష‌ర్మిల‌. క‌బ్జాలు, దందాలు, కేసులు చూసి దేశం విస్తు పోతోంద‌న్నారు. తెలంగాణ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. నీళ్లు , నిధులు, నియామ‌కాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రం ఇవాళ పూడ్చ‌లేని అప్పుల్లో కూరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆదాయం రూ. 3.17 ల‌క్ష‌ల‌కు పెరిగిందంటూ సీఎం గొప్ప‌గా చెప్పార‌ని కానీ ప్ర‌తి ఒక్క‌రి మీద ల‌క్ష‌న్న‌ర‌కు పైగా అప్పు మిగిలి ఉంద‌న్నారు . 2014లో రూ. 16 వేల కోట్ల మిగులు బ‌డ్జెట్ తో ఉన్న రాష్ట్రం 2023 నాటికి 5 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కు ఎలా చేరింద‌ని కేసీఆర్ ను నిల‌దీసింది వైఎస్ ష‌ర్మిల‌. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దిక్కు లేదు. సీతారామ ప్రాజెక్టు ప‌త్తా లేద‌ని మండిప‌డింది. కేజీ టు పీజీ అట‌కెక్కింది, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అడ్ర‌స్ లేకుండా పోయింద‌న్నారు.

Also Read : MP Sanjay Singh

Leave A Reply

Your Email Id will not be published!