Vivek Agnihotri : వివేక్ అగ్నిహోత్రిపై ఫైర్
వివేక్ అగ్నిహోత్రి : దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ తీయి
Vivek Agnihotri : కశ్మీర్ ఫైల్స్ పేరుతో సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri)పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ తీయగలవా అంటూ నిలదీశారు. దీనికి తాను ఎందుకు తీయాలంటూ సెటైర్ వేశారు.
దర్శకుడి స్పందనపై భగ్గుమంటున్నారు. ఆయనపై ఇప్పటికే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే ఆరోపణలు లేక పోలేదు. ఆయన తీసిన కాశ్మీర్ ఫైల్స్ ను భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు , ప్రధాని, ఆయా రాష్ట్రాలు భుజాన వేసుకున్నాయి. పెద్ద ఎత్తున తామే తీసినట్లు ప్రచారం చేసుకున్నాయి.
Vivek Agnihotri To Manipur’s Issue
ఈ తరుణంలో బాధ్యత కలిగిన దర్శకుడిగా ఎందుకు మణిపూర్ పై మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి వైరల్ గా మారారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మణిపూర్ చర్చనీయాంశంగా మారింది. చివరకు సుప్రీంకోర్టు సైతం నిప్పులు చెరిగింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర పోతున్నాయా అంటూ ప్రశ్నించింది. ఆపై మీరు మౌనంగా ఉంటే మేం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
అయినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జస్ట్ రెండు మాటలు మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా రక్షణ శాఖ మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ అల్లర్లు ఆగడం లేదు.
Also Read : CM Stalin Guarantee : మణిపూర్ అథ్లెట్లకు స్టాలిన్ భరోసా