Pawan Kalyan Gaddar : ప్రజా యుద్ద నౌక ఆరోగ్యంపై ఆరా
పరామర్శించిన జనసేన చీఫ్ పవన్
Pawan Kalyan Gaddar : ప్రజా యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గద్దర్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలుసుకున్న వెంటనే హుటా హుటిన అపోలోకు చేరుకున్నారు. ఈ సందర్బంగా గద్దర్ తో కరచాలనం చేశారు. ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. ఎలాంటి ఆందోళన చెంద వద్దని తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ముందు నుంచీ గద్దర్ అంటే, ఆయన పాటలు అంటే పవన్ కళ్యాణ్ కు ఇష్టం.
Pawan Kalyan Gaddar Meet
పాటలే కాదు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై గద్దర్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లు పలుమార్లు చర్చించారు. అవసరమైన సమయంలో కలుసుకున్నారు. గద్దర్ పై కాల్పులు జరిగాయి గతంలో. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో. ఆయన శరీరం లోపట ఉన్న బుల్లెట్లను తీశారు. కానీ ఒక దానిని అలాగే ఉంచారు. దానిని తీస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆనాడు వైద్యులు హెచ్చరించారు.
దీంతో ప్రజా యుద్ద నౌకగా పేరు పొందిన గద్దర్ తన శరీరంలో తూటాను శరీరంలో పెట్టుకుని ఇన్నాళ్లపాటు జీవితం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు గద్దర్. ఆ వెంటనే ఆయనను కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రజా యుద్ద నౌక ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ కు తెలిపారు. అనంతరం గద్దర్ ను పవర్ స్టార్ ఆలింగనం చేసుకున్నారు.
Also Read : Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి