Nara Chandrababu Naidu: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సతీమణికి చంద్రబాబు హామీ !

మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సతీమణికి చంద్రబాబు హామీ !

Nara Chandrababu Naidu: అరకు మాజీ ఎమ్మెల్యే, దివంగత టీడీపీ నేత సివేరి సోమ సతీమణి ఇచ్చావతి… తన కుమారుడితో కలిసి కరకట్టపై వేచి ఉండడాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్ ని ఆపి… కారు దిగి వారిని దగ్గరకు పిలిచి మాట్లాడారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాదు పార్టీ తరఫున అన్ని విధాలుగా ఉండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని హామీనిచ్చారు. ఉండవల్లి నివాసం నుంచి శుక్రవారం రాష్ట్ర సచివాలయానికి పయనమైన ఆయన… రహదారి వెంట వేచి ఉన్న ప్రజల్లో ఆమెను గుర్తుపట్టారు. వెంటనే తన వాహనశ్రేణిని ఆపించి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన కుమారుడి చదువు విషయాన్ని చంద్రబాబు(Nara Chandrababu Naidu) దృష్టికి తీసుకెళ్లగా… ఇక నుంచి ఆ బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీనిచ్చారు.

Nara Chandrababu Naidu…

‘లోకేశ్‌ను కలవడానికి వచ్చా. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో చంద్రబాబును కలవాలని ఇక్కడ వేచి ఉన్నా. గతంలో మా కుటుంబాన్ని ఆదుకుంటానని, నా కుమారుణ్ని ఉన్నత చదువులు చదివిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చా. నన్ను చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు’ అని ఇచ్చావతి పేర్కొన్నారు.

2018లో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందారు. అప్పట్లో ఈ జంట హత్యలు సంచలనం రేపాయి. కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ కు అప్పట్లో మంత్రి పదవి ఇవ్వగా… రెండో కుమారుడుకి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చారు. అదే సమయంలో సివేరి సోమ కుటుంబానికి కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. సివేరి సోమ కుమారుడికి పార్టీలో ప్రాథాన్యత ఇవ్వడంతో పాటు ఎస్టీ కమీషన్ సభ్యులగా అప్పట్లో నియమించారు. అదే సమయంలో సోమా రెండో భార్యకు కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Mallu Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం – సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ

Leave A Reply

Your Email Id will not be published!