Minister BC Janardhan : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుభవార్త చెప్పిన మంత్రి

ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరన్నారు...

BC Janardhan : ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(BC Janardhan) కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి దీపం పథకం మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి గుడ్‌ న్యూస్ చెప్పారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు.

Minister BC Janardhan Reddy Comment

అలాగే సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారన్నారు. రెండు రోజులు ఏపీలో.. ఆరు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) విజయనగరంలో గుంతలు పూడ్చే కార్య క్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ నినాదంతో ముందుకు వెళుతున్నామని మంత్రి బీసీ జానార్ధన్ పేర్కొన్నారు.

Also Read : Minister Seethakka : గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు చేసింది సూన్యం

Leave A Reply

Your Email Id will not be published!