F3 Movie : షూటింగ్ ముగిసింది న‌వ్వ‌డ‌మే మిగిలింది

అటు ఇటు అయినా థియేట‌ర్ల‌లోనే ప‌క్కా

F3 Movie : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడి(F3 Movie) సినీ అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పాడు. ఇప్ప‌టికే దిల్ రాజు నిర్మాణంలో వ‌చ్చిన ఎఫ్ 2 తెలుగు సినీ రంగాన్ని షేక్ చేసింది.

సందేశంతో పాటు ఫుల్ కామెడీని పండించే వాళ్ల‌లో జంధ్యాల త‌ర్వాత అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యాన్ని సినిమాలో ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌స్తున్నాడు ద‌ర్శ‌కుడు.

ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ పేరుతో ఎఫ్ 2 దుమ్ము రేపింది. బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టింది. ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలు లేకుండానే కోట్లు కొల్ల‌గొట్టింది. ఇందులో పండించిన కామెడీ క‌డుపుబ్బా న‌వ్వించేలా చేసింది.

ఇందులో విక్ట‌రీ వెంకటేశ్, వ‌రుణ్ తేజ్, మెహ‌రీస్, త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌గ‌తి, ప్ర‌దీప్ ల డైలాగ్ లు పేలాయి. ప్ర‌ధానంగా రాజేంద్ర‌ప్ర‌సాద్ కామెడీ టైమింగ్ అదిరింది.

ఎఫ్ 2 భారీ స‌క్సెస్ తో దిల్ రాజు ఆ మూవీకి సీక్వెల్ గా అనిల్ రావిపూడితో ప్రారంభించాడు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. వాయిదా ప‌డుతూ వ‌చ్చిన మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌రింత కామెడీ డోసు ఎక్కువ ఉండేలా చేశాడు ద‌ర్శ‌కుడు .

ఈసారి ఎఫ్ 3లో (F3 Movie)అద‌నంగా మ‌రికొంద‌రి న‌టీన‌టుల‌ను తీసుకున్నాడు అనిల్ రావిపూడి. సునీల్, సోనాల్ చౌహాన్ ఉన్నారు. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

థియేట‌ర్ల‌లో రావ‌డం ప‌క్కాని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. సంగీతం దేవిశ్రీ ప్ర‌సాద్ అందిస్తున్నారు.

Also Read : ‘అనుష్క‌’తో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ బిగ్ డీల్

Also Read : ‘అనుష్క‌’తో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ బిగ్ డీల్

Leave A Reply

Your Email Id will not be published!