F3 Movie : ఎండా కాలం లోనే న‌వ్వుల వినోదం

మ‌ళ్లీ తేదీ మార్చిన ఎఫ్ -3 మూవీ మేక‌ర్స్

F3 Movie : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరొందారు అనిల్ రావిపూడి. ఆయ‌న ఎవ‌రితో మూవీ తీసినా అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టే. టైమింగ్ తో పాటు ప‌ర్ ఫెక్ట్ గా డైలాగులు పేల్చే వారిలో మ‌నోడు ముందుంటాడు.

ద‌ర్శ‌కుల‌లో ఒక్కొక్క‌రిది ఒక్కో స్టైల్. మ‌నోడు ప్రిన్స్ తో తీసిన స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ దుమ్ము రేపింది. ఇక ఇదే ద‌ర్శ‌కుడు తీసిన ఎఫ్ -2 ఊహించ‌ని రీతిలో బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది.

ఆద్యంత‌మూ న‌వ్వులు పంచుతూ జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా చేసింది. దీంతో నిర్మాత దిల్ రాజు ఎఫ్ -2 కి సీక్వెల్ గా ఎఫ్ -3ని(F3 Movie) స్టార్ట్ చేశాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా అయి పోవ‌చ్చింది.

కానీ క‌రోనా కార‌ణంగా ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మెల మెల్ల‌గా స‌ర్దుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన బ‌న్నీ న‌టించిన పుష్ప‌, బాల‌య్య బాబు న‌టించిన అఖండ‌లు దుమ్ము రేపాయి.

ఇక ఎఫ్ -3 మూవీలో విక్ట‌రీ వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఎప్ప‌టి లాగే దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్ర‌ధానంగా ఇటీవ‌ల రిలీజ్ చేసిన లబ్ డ‌బ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. గ‌తంలో విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్ తాజాగా మ‌రో కొత్త డేట్ ను డిక్లేర్ చేశారు.

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా న్యూ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది ఎఫ్ -3 టీం(F3 Movie). మే 27న థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తామ‌ని తెలిపారు. పిల్ల‌లు ప‌రీక్ష‌లు ముగించు కోండి.

పెద్ద‌లు స‌మ్మ‌ర్ సంద‌డి కోసం రెడీగా ఉండండి..ఫ‌న్ పిక్నిక్ కు డేట్ ఫిక్స్ చేశామంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

Also Read : చీప్ కామెంట్స్ పై దేత్త‌డి హారిక ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!