Kodali Nani : ఈ జ‌న్మ‌లో బాబు సీఎం కాలేడు

నిప్పులు చెరిగిన కొడాలి నాని

Kodali Nani  : ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై మండిప‌డ్డారు. ఈ జ‌న్మ‌లోనే కాదు వ‌చ్చే జ‌న్మ‌లో కూడా చంద్ర‌బాబు ఇక సీఎం కాలేడ‌న్నారు.

ఆయ‌న ప‌నై పోయింద‌ని జోస్యం చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం ఎంత గానో కృషి చేస్తున్న సీఎం జ‌గ‌న్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని, ప్ర‌ధానంగా ఎల్లో మీడియా త‌న హ‌ద్దులు దాటుతోందంటూ మండిప‌డ్డారు.

ప్ర‌తి రోజూ ఏదో క‌థ‌నంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించేలా చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబును ఉన్నట్టుండి సీఎం చేయాల‌ని అనుకుంటున్నార‌ని కానీ ఈ జ‌న్మ‌లో జ‌ర‌గ‌ని ప‌ని తెలుసుకుంటే మంచిద‌ని హెచ్చ‌రించారు.

ధాన్యం ఎగుమ‌తి చేయ‌డంలో కాకినాడ పోర్టుది టాప్ లో ఉంద‌న్నారు. రైతులు ఏ పంట‌లు పండించినా వాటికి సంబంధించిన అన్ని వివ‌రాలు ఈ క్రాప్ యాప్ లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

స‌న్న బియ్యం ఎగుమ‌తిలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేద‌న్నారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకుంటే మంచిద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ఇవాళ కొడాలి నాని(Kodali Nani )తాడేప‌ల్లి గూడెంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అస్త‌వ్య‌స్తంగా చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుద‌న్నారు.

తాము వ‌చ్చాక దానిని గాడిలో పెట్టామ‌న్నారు. ఇక‌నైనా త‌ప్పుడు రాత‌లు మానుకుంటే బావుంటుంద‌ని సూచించారు నాని.

Also Read : ఏపీపీఎస్‌సీ చైర్మ‌న్ గా గౌతం స‌వాంగ్

Leave A Reply

Your Email Id will not be published!