Radha Krishna Kumar : ప్రేమ క‌థా కావ్య‌మ్ రాధే శ్యామ్

సెల్యూలాడ్ పై సూప‌ర్ ల‌వ్ స్టోరీ

Radha Krishna Kumar  : జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన రాధే శ్యామ్ ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే నెల మార్చి 11న విడుద‌ల కానుంది.

దీంతో ఆ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ జ‌నాన్ని పిచ్చెక్కంచేలా చేస్తోంది. మూవీ మేక‌ర్స్ రాధే శ్యామ్ కు సంబంధించి టీజ‌ర్స్ ,

పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. తాజాగా తుషార క‌ల‌లే అన్న పేరుతో ఫుల్ లిరిక్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ప్ర‌స్తుతం రాధే శ్యామ్ కు సంబంధించి క‌ల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడు పోయాయ‌ని. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డు గానే చెప్ప‌క త‌ప్ప‌దు.

పాన్ ఇండియా హీరోగా ఇప్ప‌టికే పేరు పొందిన ప్ర‌భాస్ ఈ సినిమాపై విప‌రీత‌మైన న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నాడు.

బాహు బ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సాహో విడుద‌లైంది. కానీ అంచ‌నాల‌కు మించి స‌క్సెస్ అందుకోలేక పోయింది.

సుదీర్ఘ కాలం గ్యాప్ త‌ర్వాత ప్ర‌భాస్ ఇప్పుడు మ‌ళ్లీ రాధే శ్యామ్ తో ఫుల్ ప్రేమ క‌థా చిత్రంతో ముందుకు వ‌స్తున్నాడు.

హాలీవుడ్ సైతం విస్తు పోయేలా రాధే శ్యామ్ ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్(Radha Krishna Kumar ).

ఇందులో ప్ర‌భాస్ , పూజాలు రోమియో జూలియ‌ట్ ల‌ను మ‌రిపించేలా చేశారు. కాగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

నాలుగేళ్ల పాటు క‌థ‌ను త‌యారు చేసుకున్నా. ప్ర‌భాస్ టైం ఇవ్వ‌డం ఆనందం ఉంద‌న్నాడు.

ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కు మార్చాన‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి ఆ విజువ‌ల్ హైలెట్ గా నిలిచింద‌న్నాడు. త‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీ రికార్డింగ్ , బ్యాక గ్రౌండ్ స్కోర్ తో మంచి ఈజ్ తిసుకు వ‌చ్చాడ‌ని చెప్పాడు.

Also Read : స్టార్ ఇమేజ్ పెంచిన భీమ్లా నాయ‌క్

Leave A Reply

Your Email Id will not be published!