Akasa Air Suffers : అకాసా ఎయిర్ మెగా డేటా ఉల్లంఘన
ప్రయాణీకుల వివరాలకు ఢోకా లేదు
Akasa Air Suffers : అకాసా ఎయిర్ మెగా డేటా ఉల్లంఘనకు గురైంది. ఇదే విషయాన్ని సంస్థ పంచుకుంది. ప్రభుత్వ ఏజెన్సీతో వివరాలను పంచుకుంది.
ఎయిర్ లైన్స్ కు సంబంధించిన లాగిన్ , సైన్ అప్ సేవకు సంబంధించిన తాత్కాలిక సాంకేతిక కాన్ఫిగరేషన్ లోపం ఆగస్టు 25న చోటు చేసుకుందని తెలిపింది.
ఈ విషయాన్ని స్వయంగా అకాసా ఎయిర్ ఆదివారం మెయిల్ లో వెల్లడించింది. ప్రయాణ రికార్డులు లేదా చెల్లింపు సమాచారం వంటి ప్రయాణికుల రహస్య వివరాలు లీఈక్ సమయంలో బహిర్గతం కాలేదని అకాసా ఎయిర్ స్పష్టం చేసింది.
ఈ మేరకు కంపెనీ తన అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొంది. అకాసా ఎయిర్ తన ప్రయాణీకుల వ్యక్తిగత వివరాలతో కూడిన మెగా డేటా ఉల్లంఘనకు గురైంది.
భారతీయ దేశీయ విమానయాన సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి.ఇన్ ) బృందానికి సమాచారం అందచేయడం జరిగిందని తెలిపింది.
ప్రయాణీకుల పేరు, స్త్రీయా లేక పురుషుడా, ఫోన్ నంబర్ , ఇమెయిల్ ఐడీలు వంటి వివరాలు లీక్ అయినట్లు ప్రభుత్వ ఆధీనంలోని సంస్థకు ముందుగానే తెలియ చేసినట్లు పేర్కొంది అకాసా ఎయిర్(Akasa Air Suffers) .
కాగా లీక్ సమయంలో ప్రయాణ రికార్డులు లేదా చెల్లింపు సమాచారం వటి ప్రయాణీకుల రహస్య వివరాలు ఏవీ బహిర్గతం కాలేదని పేర్కొంది.
ఘటనపై లోతుగా పరిశోధనలు చేసేందుకు భద్రతా ఏజెన్సీలు సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సీఇఆర్టీ -ఇన్ అనేది ఇలాంటి లోపాలు ఎదురైన సమయంలో బాధ్యత వహించే ప్రభుత్వ అధీకృత సంస్థ.
Also Read : ఎవరొచ్చినా మాకు పోటీ కారు – మిట్టల్