IPL 2023 Focus : ఐపీఎల్ వేలంలో అంద‌రి క‌ళ్లు వీరి పైనే

వ‌చ్చే ఏడాది 2023లో నిర్వ‌హించే మెగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) టోర్నీకి సంబంధించి సంద‌డి మొద‌లైంది. కేర‌ళ లోని కొచ్చిలో మినీ వేలం పాట‌కు వేళ అయ్యింది. మొత్తం 925 మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే బీసీసీఐ కేవ‌లం 405 మంది ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే ఛాన్స్ ఇచ్చింది.

ఈ ఏడాది నుంచి రెండు జ‌ట్లు అద‌నంగా పాల్గొంటున్నాయి. వాటిలో ల‌క్నో జెయింట్స్ కాగా ఇంకోటి గుజ‌రాత్ టైటాన్స్. ఇదిలా ఉండ‌గా మినీ వేలం పాట‌లో ఎక్కువ‌గా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచేది మాత్రం ఆయా ఫ్రాంచైజీల‌కు సంబంధించిన య‌జ‌మానులు. ఒక ర‌కంగా చెప్పాలంటే ముద్దుగుమ్మ‌లుగా పేరొందారు.