Amit Shah : ఆరోగ్య సంరక్షణకు ఢోకా లేదు – షా
మౌలిక సదుపాయాల కల్పన
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమర్థుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆరోగ్య పరంగా బలంగా ఉందన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పారు. గతంలో వసతి సౌకర్యాలు దేశంలో కేవలం ప్రాథమిక స్థాయిలో ఉండేవన్నారు. కానీ తాము వచ్చాక వాటిని తృతీయ స్థాయికి తీసుకు వెళ్లామని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా(Amit Shah). అంతే కాకుండా జన ఔషధి కేంద్రాల ద్వారా ఏకంగా 20 వేల కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు.
ఇదంతా ఆరోగ్య వసతి సౌకర్యాలను మెరుగు పర్చడం వల్ల కలిగిందని చెప్పారు. పేదలకు రూ. 5 లక్షల దాకా ఉచిత చికిత్స అందజేస్తామని పేర్కొన్నారు. అయితే మారుతున్న టెక్నాలజీని ఆరోగ్య రంగానికి అనుసంధానం చేయడం వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పారు అమిత్ షా. సాంకేతిక పరివర్తన అన్ని రంగాలలో కీలక భూమిక పోషిస్తోందన్నారు కేంద్ర మంత్రి.
ఈ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. కరోనా వ్యాక్సినేషన్ , టెలీ మెడిసిన్ , ఆస్పత్రి రిజిస్ట్రేషన్ , ఆరోగ్య రికార్డులను యాక్సెస్ చేయడం వంటివి అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు అమిత్ చంద్ర షా.
Also Read : Smriti Irani Rahul Gandhi : భారత్ పరువు తీసిన రాహుల్