APSRTC Electric Buses : ఏపీఎస్ఆర్టీసీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు
సరఫరా చేసిన ఓలెక్ట్రా కంపెనీ
APSRTC Electric Buses : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కి విద్యుత్ బస్సుల(Electric Buses) తయారీలో అగ్రగామిగా ఉన్న ఓలెక్ట్రా 100 బస్సులు ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి తిరుమలకు 50 బస్సులు , తిరుమల నుంచి రేణుగుంట ఎయిర్ పోర్ట్ కు 14 బస్సులు, కడప, నెల్లూరు, మదనపల్లి నుంచి తిరుపతికి 36 బస్సులు నడుపుతారు. ఇప్పటికే 88 బస్సులను ఆర్టీసీకి ఓలెక్ట్రా సంస్థ అందజేసింది.
మిగిలిన 12 బస్సులను సోమవారం అందజేసింది. ఈ బస్సులను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి తిరుపతికి ఆర్టీసీ నడుపుతుంది. వీటిని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున్ రెడ్డి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఆర్టీసీ సంస్థతో ఒలెక్ట్రా కంపెనీ 100 బస్సులు తయారు చేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దశల వారీగా బస్సులను అందజేస్తూ వచ్చింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తిరుపతి నుంచి తిరుమల పుణ్య క్షేత్రానికి 40 ఓలెక్ట్రా బస్సులను నడుపుతోంది. అలాగే ఎయిర్ పోర్టుకు , ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిని అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. మదనపల్లి తిరుపతి మధ్య రోజుకు 4 వేల కిలోమీటర్లకు పైగా ఓలెక్ట్రా బస్సులు ప్రయాణిస్తాయి. ఇక తిరుమలలో భక్తుల సేవలో 10 బస్సులు నిరంతరం నడుస్తున్నాయి. ఇప్పటి దాకా ఏపీలో 1.4 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం.
Also Read : Mamata Banergee DK : దీదీకి డీకే గ్రాండ్ వెల్ కమ్